పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సంజయ్ దత్

Sanjay Dutt Political Entry | తాను రెండో సారి రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని ఆయన తేల్చిచెప్పారు.

news18-telugu
Updated: August 27, 2019, 10:16 AM IST
పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సంజయ్ దత్
సంజయ్ దత్ (ఫైల్ ఫోటో)
  • Share this:
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారన్న కథనాలు మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సంజయ్ దత్ సెప్టెంబరు 25న తమ పార్టీలో చేరనున్నట్లు మహారాష్ట్రలో సంకీర్ణ సర్కారులో భాగస్వామ్యపక్షమైన రాష్ట్రీయ సమాజ్ పక్ష(ఆర్ఎస్పీ) చీఫ్, ఆ రాష్ట్ర మంత్రి మహాదేవ్ శంకర్ సంచలన ప్రకటన చేశారు. దీనిపై స్పందించిన సంజయ్ దత్ తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టంచేశారు.

‘నేను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు. మహాదేవ్ శంకర్ నాకు ఆప్త మిత్రుడు, సోదర సమానులు. ఆయనకు భవిష్యత్తులో అంతా మేలు జరగాలని కోరుకుంటున్నా’ అంటూ సంజయ్ దత్ పేర్కొన్నారు. 2009 లోక్‌‌సభ ఎన్నికల్లో సంజయ్ దత్ సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా లక్నో నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

అక్టోబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ సంజయ్ దత్ రాజకీయాల్లో ప్రవేశించనున్నారన్న కథనాలు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ కథనాలను తోసిపుచ్చుతూ తన పొలిటికల్ ఎంట్రీపై వినిపిస్తున్న ఊహాగానాలకు సంజయ్ దత్ స్వయంగా ముగింపు పలికారు.

First published: August 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు