Home /News /politics /

SANIA MIRZA NAME MENTIONED AS PT USHA IN FLEXI TROLLINGS ON YSRCP MS

సానియా మీర్జాను పీటీ ఉషని చేసేశారు.. ఫ్లెక్సీతో ప్రభుత్వం అభాసుపాలు..

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

క్రీడాకారులకు ప్రోత్సహకాలు అందించాలన్న మంచి ఉద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమం చేపట్టినప్పటికీ.. అసలు విషయం పక్కకుపోయి..ఈ పోస్టర్‌ పైనే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీయేనా..? లేక ఎవరైనా ఫ్లెక్సీని మార్ఫింగ్ చేశారా..? అన్న చర్చ కూడా జరుగుతోంది.

ఇంకా చదవండి ...
    నేడు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ ప్రభుత్వం క్రీడా ప్రోత్సహకాలు అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విశాఖ బీచ్‌ రోడ్డులో మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రీడా ర్యాలీ చేపట్టారు.ఇక్కడివరకు అంతా బాగానే ఉంది కానీ.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీయే ప్రభుత్వాన్ని అభాసుపాలయ్యేలా
    చేసింది. బీచ్ రోడ్‌లో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బొమ్మను ముద్రించి.. కింద పేరు మాత్రం పీటి ఉష అని రాశారు. అంతేకాదు, 'క్రీడా పోటసహకాలు' అంటూ ఇంగ్లీషులో తప్పుగా ముద్రించారు. దీంతో ప్రభుత్వ అధికారులకు ఈమాత్రం క్రీడా పరిజ్ఞానం లేదా..? అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.క్రీడాకారులకు ప్రోత్సహకాలు అందించాలన్న మంచి ఉద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమం చేపట్టినప్పటికీ.. అసలు విషయం పక్కకుపోయి..ఈ పోస్టర్‌ పైనే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది. అయితే ఇది ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీయేనా..? లేక ఎవరైనా ఫ్లెక్సీని మార్ఫింగ్ చేశారా..? అన్న చర్చ కూడా జరుగుతోంది.

    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: PT Usha, Sania Mirza, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు