హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు... కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు

హరీష్ రావ్ మీద అసభ్యకరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

news18-telugu
Updated: January 19, 2020, 10:42 PM IST
హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు... కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు
జగ్గారెడ్డి( ఫేస్ బుక్ ఫోటో)
  • Share this:
తెలంగాణ ఆర్థికమంత్రి టి. హరీష్ రావ్ మీద అసభ్యకరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్స్ 153a, 188, 504ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటమి తప్పదనే నిర్దారణకు వచ్చిన జగ్గారెడ్డి, మంత్రిని టార్గెట్ చేసుకొని అనాగరికంగా దూషణలు చేశారని టీఆర్ఎస్ నాయకులు చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ విలేకరుల సమావేశంలో విమర్శించారు. అసభ్యకరమైన, అనాగరికమైన భాష ద్వారా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ సంగారెడ్డికి తలవంపులు తెస్తున్న జగ్గారెడ్డి అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు