Home /News /politics /

SANGAREDDY MLA JAGGAREDDY WROTE A LETTER TO CONGRESS CHIEF SONIA GANDHI AND MP RAHUL GANDHI AND JAGGA REDDY MADE IT CLEAR IN THE LETTER THAT HE WOULD RESIGN FROM THE PARTY SOON PRV

Jagga reddy: సోనియా, రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ.. ఈ క్షణం నుంచి పార్టీలో లేనని స్పష్టీకరణ..  లేఖలో ఏం విన్నవించారంటే..

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia gandhi) , ఎంపీ రాహుల్ గాంధీలకు (Raghul gandhi) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ (Jagga reddy) రాశారు. త్వరలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని లేఖలో జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఆ లేఖలో ఆయన ఏం రాశారంటే..

ఇంకా చదవండి ...
    కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia gandhi) , ఎంపీ రాహుల్ గాంధీలకు (Raghul gandhi) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ (Jagga reddy) రాశారు. ఈ లేఖ రాసిన క్షణం నుంచి తాను కాంగ్రెస్‌లో లేనట్లేనని అన్నారు. సడెన్‌గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చని జగ్గారెడ్డి పేర్కొన్నారు. తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కాంగ్రెస్‌లో వర్గ పోరు వుండేదని జగ్గారెడ్డి గుర్తుచేశారు. త్వరలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని లేఖలో జగ్గారెడ్డి (Jagga reddy) స్పష్టం చేశారు. ఆ లేఖలో ఆయన ఏం రాశారంటే..

    గౌరవనీయులైన సోనియా గాంధీ గారికి,

    తెలంగాణ రాష్ట్రం ఇప్పించిన కాంగ్రెస్ నాయకులు ఎంతో మంది పార్టీ నుండి బయటికి పోయారు.. కాంగ్రెస్ లో సడన్ గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చు.. అంతకంటే తప్పు నేను చేయలేదు. చేయను కూడా సొంత పార్టీ లోనే కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా జగ్గారెడ్డి టీఆర్​ఎస్​ కోవర్టు అని ప్రచారం జరుగుతున్నా.. దీనిని ఖండించే వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ లో లేకపోవడం దురదృష్టకరం. ఎవరైనా వేరే రాజకీయ పార్టీ వారు జగ్గారెడ్డి (Jagga reddy) ని పిలిస్తే అమ్ముడు పోయాడనే ఒక చరిత్ర ఉంటుందనే నేను వేరే పార్టీ లోకి పోలేదు.. ఇంత ఆర్థిక కష్టాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ లో ఉంటే.. ఇక్కడ ఉన్నది ఉన్నట్లు గా మాట్లాడితే కోవర్టు అనే ఒక ప్రచారాన్ని ఇందులో ఉన్న కొందరు నాయకులే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ప్రచారం చేయిస్తున్నారు.

    వ్యక్తిత్వాన్ని అమ్ముకోను..

    నా తల్లి దండ్రులు నాకు ఇచ్చిన ఈ పుట్టుక, నా తల్లి పెంపకం పది మందికి మేలు జరిగేలా ఉపయోగపడాలి, మంచి పేరు తెచ్చుకోవలనేదే నా తల్లి కోరిక. నేను నా వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా అమ్మను, అమ్ముకొను. ఆర్ధిక ఇబ్బందులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి.. నేను నా సొంత కష్టం, శక్తి మీదనే నా వయసు 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రయాణం చేస్తున్నా. నా రాజకీయ జీవితాన్ని ముందుకు నడపడానికి ఎవరినైనా అప్పు అడుగుతా.. కానీ డోనేషన్ లు అడగను. హుందాగా బతుకుదాం అనుకున్న కాంగ్రెస్ లో నాకు ఇలాంటి కోవర్టు అనే చెడ్డ పేరు ప్రచారం జరగడం బాధాకరం.

    వేరే పార్టీ లోకి పోవాలనుకుంటే నేరుగా పోతాను కదా..

    ఇలాంటి ప్రచారం చేస్తున్న మూర్ఖులు ఆలోచన చేయాలి నేను వేరే పార్టీ లోకి పోవాలనుకుంటే నేరుగా పోతాను కదా ఇక్కడ ఉండి కోవర్టు అని ప్రచారం తెచ్చుకునే కర్మ నాకెందుకు.. రెండు రాష్ట్రాలు చేసేటప్పుడు కూడా చెప్పిన. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని. అప్పుడు నన్ను తెలంగాణ ద్రోహి అన్నారు.. కానీ ఇప్పుడు అయ్యో జగ్గారెడ్డి చెప్పింది నిజమే కదా రాజకీయంగా మేము దెబ్బ తిన్నామనే ఫీలింగ్ లో ఉన్నారు, ఇప్పుడు బాధపడి లాభం లేదు కదా..? అలాగే ఇప్పుడు పార్టీ లో కొన్ని లోటుపాట్లు చెప్తూ, సమన్వయం చేసుకోండి.. గ్రౌండ్ లోకి వెళ్ళండి అని చెపితే కోవర్టు అనే పనికిమాలిన నింద నాపై వేస్తున్నారు. అలాగే పార్టీ కోసం అనేక త్యాగాలు చేసిన వారిని కూడా వారి వల్ల ప్రస్తుతం ఉన్న నాయకులకు ఇబ్బంది కలుగుతుందని ప్రణాళిక బద్దంగా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఇక్కడ ఉండి ఈ పనికిమాలిన నిందలతో ఆవేదన చెందడం కంటే నా మనసాక్షి కి కట్టబడి స్వతంత్రంగా నా రాజకీయ జీవితం గడపటం మేలు అని నిర్ణయం చేసుకోవడం జరిగింది.

    ఇటీవలే రాష్ట్రంలో 12 స్థానాలకు జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో నా భార్య నిర్మల జగ్గారెడ్డి ని పోటీ చేయించి ఉమ్మడి మెదక్ సీఎం జిల్లా లో కాంగ్రెస్ ఓట్లకంటే ఒక ఓటు తగ్గిన నా పార్టీ పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేసి పార్టీ పరువు, మర్యాద నిలపెట్టన నాకు ఇచ్చే గౌరవం టీఆర్​ఎస్​ కోవర్టు అనే పేరా..! కాంగ్రెస్ పార్టీ లో హేమహేమీ నాయకులు కూడా స్థానిక సంస్థల ఎన్నికలో వారి సొంత జిల్లాల్లో పోటీ చేయడానికి కూడా ముందుకు రాలేదు. అలాంటి సమయంలో పార్టీ పరువు కోసం దైర్యం చేసి పోటీ చేయిస్తే నన్ను కోవర్టు అని కొన్ని యూట్యూబ్ చానెల్స్ ప్రచారం చేస్తుంటే పార్టీ లో ఏ ఒక్కరు దీనిని ఖండించారా.. అసలు ఎవరు కోవర్టు పోటీ పెట్టని వారా.. పార్టీ కోసం పోటీ పెట్టి పరువు కాపాడిన నేనా.. హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీ పరువు నాశనం చేసినవారు కోవర్టులా లేక ఉన్నది. ఉన్నట్లు మాట్లాడే నేను కోవర్టునా..!

    అలాగే 2017 లో రాహుల్ గాంధీ సభ పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోతే నేను కోట్లు ఖర్చు పెట్టి సభ నిర్వహణ చేశాను.. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి ఒక కొత్త జోష్ వచ్చింది. ఇలాంటి నాకు మీరు ఇచ్చే బిరుదు టీఆరెస్ కోవర్టు..దీని పై పార్టీ లో సీనియర్ నాయకులు, పార్టీ పెద్దలు ఎవరు స్పందించరా..! ఈ బిరుదల కోసం నేను ఇందులో పని చేయాలా..! ఎవరైనా రాంగ్ రూట్ లో పోతుంటే నేను మాట్లాడొద్దా..?

    ఒకప్పుడు కాంగ్రెస్ లో రాజకీయ వర్గపోరు ఉండే అది కొంత హుందాగా కనిపిస్తుంటే.... కానీ ఇప్పుడు ఆ హుందాతనం లేదు. దీని పై సమయం వచిన్నప్పుడు ఇంకా చాలా  చెప్తా..

    కురుక్షేత్ర యుద్ధంలో..

    రాజకీయాల్లో హుందా తనం ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ చెప్తున్న. అది చరిత్ర లో ఉంది. మహాభారతంలో పాండవులకు, కౌరవులకు జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధం లో కౌరవుల తరుపున యుద్ధానికి భీష్ముడు నాయకత్వం వహించాడు. అలాగే పాండవుల తరఫున అర్జునుడు నాయకత్వం వహించాడు.. ఐతే ఈ యుద్ధం ప్రారంభం కంటే ముందు అర్జునుడు భీష్ముడికి బాణాల ద్వారా పాదాలకు నమస్కారం తెలియచేసిండు. దాని అర్ధం అర్జునుడు భీష్ముడికి కోవర్టు కాదు కదా..! శత్రువైన సరే నమస్కరించడం ఒక సంస్కారం.. తర్వాత యుద్ధం యుద్ధమే.. ఇది గ్రహించమని కొంత అభిమాన సంఘాలకు కొన్ని అభిమాన యూట్యూబ్ చానెల్స్ కి ఇలాంటి చరిత్ర చదివి తెలుసుకోవాలని సూచిస్తున్న..

    ఇక భీష్ముడు పాండవుల పక్షపాతి అనేది చరిత్ర.. ఐన భీష్ముడు కౌరవుల పక్షానే యుద్ధం చేయడం జరిగింది. ఇది చరిత్ర, కానీ భీష్ముడు చనిపోయేటప్పుడు కర్ణుడు కి భీష్ముడు మీద కోపం ఉన్నపటికీ కర్ణుడు భీష్ముడు దగ్గరికి వచ్చి కన్నీటి బొట్లు కార్చి తన బాధని వ్యక్తపరిచిండు. దాని అర్ధం పాండవులకు లొంగిన్నట్లా..!కాదు కదా..! ఇలాంటి చరిత్ర లను కూడా తెలుసుకొని గ్రహించి రాజకీయాల్లో ఎట్లా పావులు కదపాలో నేర్చుకోండి.. రాహుల్ గాంధీ ని అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఒక్కరోజు వరకు స్పందించని వారు పార్టీ లోని కోవర్టులా... లేదా స్పందించిన నేను కోవర్టునా..?

    నిజం పక్షాన రాజకీయ చేయలనుకుంటున్నా..

    ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో జరుగుతున్న పరిణామాలు నాపై వేస్తున్న నిందలు నన్ను కలిచివేస్తున్నాయి. స్వేచ్చగా పేద ప్రజలకు సేవ చేస్తూ నిజం పక్షాన రాజకీయ చేయలనుకుంటున్నా. ఇలా స్వతంత్ర రాజకీయ జీవితంలో నేను ఏది మాట్లాడినా ఎవరిని ప్రశ్నించినా.. ఎవరికి రాజకీయ నష్టం, బాధ కలిగే అవకాశం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే అలాంటి ప్రయాణం చేయాలని నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ త్వరలో ప్రకటించడం జరుగుతుంది.

    జీవితంలో కాంగ్రెస్ పార్టీని విడిచి పోవాలని లేకుండే కానీ పరిస్థితులు నన్ను అటు వైపుగా ఆలోచన చేసే విధంగా చేస్తున్నాయి. దీంతో నేను నాకున్న పదవులకు రాజీనామా చేసి స్వాతంత్రంగా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్న..

    దయచేసి ఇక నన్ను ఎవరు కలవకండి.. నా వల్ల పార్టీ కి, వ్యక్తిగత రాజకీయ జీవితానికి నష్టమైతుందనే ఫీలింగ్ లో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఇక నుంచి రాజకీయంగా మీరందరు మంచిగా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా...

    చరిత్ర గల కుటుంబం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ది.. అందుకే వారు అంటే నాకు ఇష్టం. నేను స్వేచ్చగా రాజకీయాలు చేసుకున్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని గౌరవిస్తూనే గౌరవం.. ఉంటా..!

    ఈ ప్రకటన విడుదల చేసిన తర్వాత ఆ క్షణం నుంచి నేను కాంగ్రెస్ పార్టీ గుంపులో లేను..

    త్వరలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకి లేఖ పంపిస్తా..
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Jaggareddy, Rahul Gandhi, Revanth Reddy, Sangareddy, Sonia Gandhi, Telangana, Telangana Politics, TS Congress

    తదుపరి వార్తలు