నాకు రూ.100 కోట్ల అప్పు... కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తనను నమ్మిన పార్టీ క్యాడర్, మిత్రులే ఇప్పటివరకు తనకు అప్పులిస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. అయితే తాను ఇప్పటి వరకు ఎవరికీ అమ్ముడుపోలేదని తెలిపారు.

news18-telugu
Updated: October 11, 2019, 3:52 PM IST
నాకు రూ.100 కోట్ల అప్పు... కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
జగ్గారెడ్డి( ఫేస్ బుక్ ఫోటో)
news18-telugu
Updated: October 11, 2019, 3:52 PM IST
నిత్యం ఏదో రకమైన సంచలన వ్యాఖ్యలు చేసే సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి... మరోసారి అలాంటి కామెంట్స్ చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక తాను బాగా అప్పులు చేశానని ఆయన అన్నారు. తాను అప్పులతోనే పండగలు, పబ్బాలు చేస్తున్నానని తెలపారు. అప్పులు చేసే డబ్బులు పంచుతున్నానన్న జగ్గారెడ్డి... తనకు ప్రస్తుతం వంద కోట్ల రూపాయల అప్పు ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.అయితే ఈ విషయం ఎవరూ నమ్మరని అన్నారు. తన ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో తన భార్యకు 20 తులాల బంగారం కూడా కొనలేదని అన్నారు.

సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి ఈ రకమైన కామెంట్స్ చేశారు. తనను నమ్మిన పార్టీ క్యాడర్, మిత్రులే ఇప్పటివరకు తనకు అప్పులిస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. అయితే తాను ఇప్పటి వరకు ఎవరికీ అమ్ముడుపోలేదని తెలిపారు. తనను ఎవరూ కొనలేరని.. కార్యకర్తల కష్టాల్లో పాలుపంచుకోవడమే తన రాజకీయ ఎజెండా అని స్పష్టం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కోసం కేసీఆర్ దగ్గర తల వంచుతానని అన్నారు. తాను కేసీఆర్‌కు, బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయబోనని జగ్గారెడ్డి అన్నారు. తాను ఏం చేసినా సంగారెడ్డి ప్రజల కోసమే అని స్పష్టం చేశారు.First published: October 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...