Home /News /politics /

SANGAREDDY MLA JAGGAREDDY MADE SENSATIONAL COMMENTS ON THE ALLEGATIONS AGAINST HIM SAYING THAT IF THE PARTY DOES NOT LIKE THE ACTIONS HE WILL BE INDEPENDENT BUT WILL NOT LEAVE THE PARTY PRV

Sangareddy MLA Jagga reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే ఇండిపెండెంట్​గా ఉంటానంటూ..

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)

పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటూ కొన్ని రోజులుగా పార్టీ నేతలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన కామెంట్స్​ చేశారు.

రాజకీయంగా, అంతర్గతంగా వంద ఉంటాయని పార్టీకి నష్టం చేకూర్చేలా ఎన్నడూ చేయబోనని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Sangareddy Congress MLA Jaggareddy) అన్నారు. పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటూ కొన్ని రోజులుగా పార్టీ నేతలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న జగ్గారెడ్డి గురువారం మీడియా ముందుకొచ్చారు. పార్టీకి దూరంగా వెళ్లాలని ఎవరూ అనుకోరని అన్నారు. పరిస్థితులు అనుకూలించకపోతే అప్పుడు మాట అప్పుడే అన్నారు జగ్గారెడ్డి. అపనిందలపాలు చేసినా వ్యక్తిగతంగా డ్యామేజ్​ చేసినా ఎప్పుడూ పార్టీని వీడాలనే అలోచన లేదని అన్నారు. తన భార్య గానీ, కూతురు గానీ ఇలా ఆలోచించలేదని తెలిపారు. టీఆర్​ఎస్​ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మీడియా స్వతంత్రాన్ని అణగదొక్కుతున్నాయని గతంలోనే చెప్పానని ఆయన అన్నారు. ఢిల్లీకి అందరూ వెళ్లాలని లేదని జగ్గారెడ్డి అన్నారు.

సోనియా, రాహుల్ గాంధీలను అపాయింట్​మెంట్​ అడుగుతా..

'మీడియాకు ఎవరు ఏం చెప్తున్నారో నాకు తెలియదు. పీఏసీ మీటింగ్‌లో ఏం జరిగిందో నేను చెప్పను. నా ఆవేదనను ఇంఛార్జ్ ఠాగూర్‌కు తెలియజేశా. నాపై వస్తున్న వార్తల్లో ఏది నిజం, ఏది అబద్దమో నేను చెప్పను. సోనియా, రాహుల్ గాంధీలను కలవడానికి అపాయింట్మెంట్ అడుగుతా. సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో జీవితాంతం పనిచేస్తా. నా వల్ల పార్టీలో ఎవరైనా ఇబ్బందులు పడితే.. ఇండిపెండెంట్‌గా ఉంటా తప్పితే.. మరో పార్టీలోకి వెళ్ళను.

ఈ నెల 20 తర్వాత భవిష్యత్ కార్యచరణ..

పార్టీని డ్యామేజ్ చేయాలనే ఆలోచన నాకు లేదు. నన్ను ఎవరు డ్యామేజ్ చేయాలని చూసినా కాంగ్రెస్‌ను వీడాలని నాకు లేదు. నా రాజీనామాపై వస్తున్న వార్తలను సమర్థించను, ఖండించను. నాతో వీహెచ్, భట్టి, శ్రీధర్ బాబు, మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.. కానీ ఆ విషయాలు బయటకు చెప్పను. కాంగ్రెస్‌నా జాగిరి కాదు. రేవంత్ రెడ్డి జాగిరి కాదు. సోనియా జాగిరి. ఈ నెల 20 తర్వాత భవిష్యత్ కార్యచరణ ఉంటుంది.

సీఎంకు లేఖ రాశా..

గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ప్లాట్‌లను, పర్మిషన్‌లేని ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని గతంలో సీఎంకు లేఖ రాశా. పాత లే అవుట్‌లను రెగ్యులరైజ్ చేయండి.. కొత్త లేఅవుట్ లు చేయకుండా చర్యలు తీసుకోండి అని కోరా. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం రాలేదు. ఈ నెల 8న ఉదయం 10 నుంచి 4 గంటల వరకు ఇందిరాపార్కులో దీక్ష చేస్తా. కోవిడ్ నిబంధనలకు లోబడి దీక్ష చేస్తా. పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా దీక్ష చేస్తాను' అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

కాగా, అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం హాట్‌హాట్‌గా సాగింది. జూమ్ యాప్ ద్వారా సమావేశమైన నేతలు.. పార్టీ యాక్షన్ ప్లాన్ కంటే ఎక్కువగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి నా తీరు నచ్చకుంటే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. తాను ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని అని వ్యాఖ్యానించారు. అయితే జగ్గారెడ్డిని మాజీమంత్రి శ్రీధర్ బాబు వారించారు. తప్పుకోవడం ఎందుకు.. సరిదిద్దుకుని పని చేయాలని జానారెడ్డి, శ్రీధర్ బాబు సూచించారు. మరోవైపు ఈ అంశంపై జగ్గారెడ్డికి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిదీ అందరికీ చెప్పాలనడం సరికాదని అన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Congress, Jagga Reddy, Politics, Sangareddy

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు