Home /News /politics /

SANGAREDDY MLA JAGGA REDDY SLAMS TRS MLA HARISH RAO OVER IRRIGATION PROJECTS SK

ఆ బాధతోనే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు..హరీష్‌రావుపై జగ్గారెడ్డి ఫైర్

జగ్గారెడ్డి, హరీశ్ రావు(ఫైల్ ఫోటో)

జగ్గారెడ్డి, హరీశ్ రావు(ఫైల్ ఫోటో)

కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు నీళ్లు తాగే హరీష్‌రావు పెరిగాడని మండిపడ్డారు జగ్గారెడ్డి. కాంగ్రెస్‌ని విమర్శిస్తూ చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

    సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం వేళ ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ప్రాజెక్టులు రాలేదన్న హరీష్ రావు వ్యాఖ్యలను జగ్గారెడ్డి తప్పుబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేన్న బాధతోనే ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మెప్పు కోసమే కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు జగ్గారెడ్డి.

    ప్రాజెక్టులు ఎవరు కట్టిచాల్సినా సమర్థించాల్సిందే. కేసీఆర్‌ని కూడా అదే విధంగా సమర్థించాం. కానీ హరీష్ రావు కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం సరికాదు. 0 ఏళ్లలో కాంగ్రెస్‌ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని హరీష్‌ రావు అవగాహన లేకకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రాజెక్టులు కట్టిందో నీకు తెలియకుంటే మీ మామను అడిగి తెలుసుకో. కల్వకుర్తి, నెట్టంపాడు, ఎల్లంపల్లి, జూరాల, దేవాదుల ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్సే. నువ్వు నీళ్లు తాగిన సింగూరు, మంజీరా ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ కాదా..?
    జగ్గారెడ్డి


    కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు నీళ్లు తాగే హరీష్‌రావు పెరిగాడని మండిపడ్డారు జగ్గారెడ్డి. కాంగ్రెస్‌ని విమర్శిస్తూ చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Harish Rao, Jagga Reddy, Telangana, Trs, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు