హరీష్ రావుతో జగ్గారెడ్డి చర్చలు..14 ఏళ్ల తర్వాత కలవడం వెనక..

హరీష్ రావును బద్ధశత్రువుగా భావించే జగ్గారెడ్డి.. ఇప్పుడు ఆయన్ను కలవడం ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.

news18-telugu
Updated: September 19, 2019, 2:46 PM IST
హరీష్ రావుతో జగ్గారెడ్డి చర్చలు..14 ఏళ్ల తర్వాత కలవడం వెనక..
జగ్గారెడ్డి, హరీశ్ రావు(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బద్ధ శత్రువులైన హరీష్ రావు, జగ్గారెడ్డి కలిశారు. మంత్రి హరీష్ రావును సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిశారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత తొలిసారి హరీష్ రావుతో మాట్లాడారు జగ్గారెడ్డి. దాదాపు అరగంట పాటు ఆయనతో చర్చలు జరిపారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన విజ్ఞప్తిపై మంత్రి హరీష్ రావు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఐతే వీరి కలయిక తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశారా? లేదంటే తెర వెనక ఇంకేమైనా జరుగుతోందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జగ్గారెడ్డి సైతం టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరకుండా హరీష్ రావే అడ్డుకున్నారని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు హరీష్ రావుపై వీలుచిక్కినప్పుడల్లా జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని చాలా సందర్భాల్లో మండిపడ్డారు. హరీష్ రావుకు చుక్కలు చూపిస్తానంటూ నిప్పులు చెరిగారు. హరీష్ రావును బద్ధశత్రువుగా భావించే జగ్గారెడ్డి.. ఇప్పుడు ఆయన్ను కలవడం ఇటు కాంగ్రెస్, అటు టీఆర్ఎస్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.
Published by: Shiva Kumar Addula
First published: September 19, 2019, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading