టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందిందట...జగ్గారెడ్డి కారెక్కబోతున్నారా?

రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ రాజకీయంగా దెబ్బతిందన్న ఆయన..తెలంగాణ ఏర్పాటుతో ప్రజలకు ఎంత లాభం జరిగిందో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: May 9, 2019, 6:09 PM IST
టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందిందట...జగ్గారెడ్డి కారెక్కబోతున్నారా?
జగ్గారెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు కాస్త చల్లబడ్డాయి. ఐతే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూడడం హాట్‌టాపిక్‌గా మారింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్‌తో చేతులు కలిపారు. ఆయనతో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం గులాబీ గూటికి చేరతారని అప్పుడే ప్రచారం జరిగింది. కానీ జగ్గారెడ్డి మాత్రం ఇప్పటికీ నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు. ఐతే తాజాగా టీఆర్ఎస్‌లో చేరికపై గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే.

టీఆర్‌ఎస్‌లోకి రావాలని కేసీఆర్‌, కేటీఆర్‌ బంధువులు తనను ఆహ్వానించారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో ఉంటానో.. తెలంగాణభవన్‌లో ఉంటానో త్వరలో తెలుస్తుందని ఆయన తెలిపారు. మే 30 లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని తేల్చి చెప్పారు. మరోవైపు కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో కాంగ్రెస్‌ సేఫ్‌ జోన్‌లో ఉంటుందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ రాజకీయంగా దెబ్బతిందన్న ఆయన..తెలంగాణ ఏర్పాటుతో ప్రజలకు ఎంత లాభం జరిగిందో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

జగ్గారెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర రాజకీయాల్లో విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ ఖాయమని..జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరతారని పలువురు నేతలు చెబుతున్నారు. ఐతే ఆయన పార్టీ మారబోరని మరికొందరు నేతలు విశ్లేషిస్తున్నారు. మరి అందరూ అనుకుంటున్నట్లుగా జగారెడ్డి గులాబీ గూటిలో చేరతారా? లేదా? అన్నది ఈ నెలాఖరులో తెలియనుంది.

First published: May 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు