హరీష్ రావును అక్కడ కాలు పెట్టనివ్వను.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్థిక మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఆయన్ను తిరగనివ్వనని ఘాటుగా వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: December 23, 2019, 3:20 PM IST
హరీష్ రావును అక్కడ కాలు పెట్టనివ్వను.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
జగ్గారెడ్డి, హరీశ్ రావు(ఫైల్ ఫోటో)
  • Share this:
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆర్థిక మంత్రి హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఆయన్ను తిరగనివ్వనని ఘాటుగా వ్యాఖ్యానించారు. మెదక్‌‌లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. సింగూర్ నీటి తరలింపు వల్ల సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సింగూర్ నీటి తరళింపు సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని, దానికి మంత్రి హరీష్ రావు అనాలోచిత నిర్ణయమేనని ఆరోపించారు. నీటి తరలించడం వల్ల సంగారెడ్డి జిల్లాతో పాటు మెదక్ ఘనపూర్ ఆయకట్టు రైతులకు, మెదక్ మునిసిపాలిటీకి నీరు అందడం లేదని అన్నారు. అధికార పార్టీకి చెందిన మెదక్ ఎమ్మెల్యే దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నీటి సమస్యను తీర్చే విషయంలో స్పష్టమైన హామీ వచ్చే వరకు హరీష్ రావును మెదక్, సంగారెడ్డి జిల్లాలో తిరగనివ్వమని అన్నారు. జిల్లా కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల సమస్యను గాలికి వదిలేసి హరీష్ రావు ఇంటి వద్ద భజన చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని, అన్ని మునిసిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: December 23, 2019, 3:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading