SANGAREDDY LOK SABHA ELECTION CONGRESS MLA JAGGA REDDY CHALLENGES TRS EX MINISTER HARISH RAO
హరీష్ చర్చకు సిద్ధమా?...సవాల్ విసిరిన ఎమ్మెల్యే జగ్గా రెడ్డి
జగ్గారెడ్డి, హరీశ్ రావు(ఫైల్ ఫోటో)
Medak Lok Sabha Election | మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన జగ్గారెడ్డి...ఆపలో ఉన్న వారికి తాను ఏటీఎమ్మే అన్నారు. ఎవరెంత సాయం చేశారో చర్చకు రావాలని సవాల్ చేశారు.
మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మాటలతూటాలు పేల్చుకుంటున్నారు. జగ్గారెడ్డి కేసులకు భయపడుతున్నాడని..ఆయన ఏటీఎంలు ఏమైపోయాయంటూ హరీష్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సంగారెడ్డిలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి పాల్గొని మాట్లాడారు. తాను కేసులకు భయపడనని, అలా భయపడితే గత నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వంపై పోరాటం చేసేవాడిని కాదని అన్నారు. ఇక ఆపదలో ఉన్న వారికి కచ్చితంగా తాను ఏటీఎంనే అని చెప్పుకొచ్చారు. ఆ విషయం సంగారెడ్డి ప్రజలందరికీ తెలుసని అన్నారు. తాను ఎంతమందికి ఆర్థిక సహాయం చేశానో.. హరీష్ ఎందరికి సాయం చేశారో చర్చకు సిద్ధమా? అంటూ హరీష్‌కు జగ్గారెడ్డి సవాల్ విసిరారు.
ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్‌లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ దగ్గర డబ్బులున్నాయని, కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులేదని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరికి వారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.