Home /News /politics /

SANGAREDDY CONGRESS MLA JAGGAREDDY MADE A SENSATIONAL DECISION AND REVEALED THAT HE WAS GOING TO MEET CM KCR PRV

Jaggareddy: సీఎం కేసీఆర్​ను కలవనున్న కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. అపాయింట్​మెంట్​కు ప్రయత్నాలు

జగ్గారెడ్డి, కేసీఆర్​ (ఫైల్​)

జగ్గారెడ్డి, కేసీఆర్​ (ఫైల్​)

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) తీరు కొద్ది రోజులుగా మరింత హాట్ టాపిక్‌గా మారింది. అయితే సీఎం కేసీఆర్​ అసెంబ్లీ వేదికగా బుధవారం ఉద్యోగాల భర్తీ ప్రకటన అనంతరం జగ్గారెడ్డి సీఎంను కలవబోతున్నట్లుచెప్పడం సంచలనం సృష్టించింది.

ఇంకా చదవండి ...
    కాంగ్రెస్ ఎమ్మెల్యే (Sanga reddy MLA), పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) తీరు కొద్ది రోజులుగా మరింత హాట్ టాపిక్‌గా మారింది. అయితే సీఎం కేసీఆర్​ అసెంబ్లీ (Telangana Assembly) వేదికగా బుధవారం ఉద్యోగాల భర్తీ ప్రకటన (Telangana Jobs) చేసిన సంగతి తెలిసిందే.  అయితే మొత్తం ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని ప్రతిపక్షాలు సీఎంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి. (Jaggareddy) . ఉద్యోగాల భర్తీ ప్రకటనపై స్పందించారు. ఉద్యోగాల భర్తీ ప్రకటనపై వ్యక్తిగతంగా హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్పారు. సీఎం కేసీఆర్‌ (CM KCR)కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పడం ఆసక్తి రేపింది. అంతేకాకుండీ సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరుతానని చెప్పడంతో కాంగ్రెస్​ శ్రేణుల్లో కొంత అలజడి కనిపించింది. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం మిగతా పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమ కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు లేవని జగ్గారెడ్డి (Jaggareddy) చెప్పుకొచ్చారు. ఏడేళ్లుగా నోటిఫికేషన్లు ఇవ్వట్లేదని పలుమార్లు ప్రభుత్వాన్ని విమర్శించామని చెప్పారు. ఏ పార్టీ అయినా రాజకీయ లబ్ది లేకుండా పనిచేయదని జగ్గారెడ్డి తెలిపారు.

    గత ఏడేళ్లుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం..

    ఈ విషయంపై జగ్గారెడ్డి మాట్లాడుతూ..  ‘ఒక ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్‌ ప్రకటనను స్వాగతిస్తున్నా. నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు గాను కేసీఆర్ (CM KCR) కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కోసం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గత ఏడేళ్లుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. నిరుద్యోగుల తరఫున యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూ ఐ ఆధ్వర్యంలో వివిధ పోరాటాలు నిర్వహించాం. తెలంగాణలో ఈరోజు ఈ ఫలాలు వస్తున్నాయంటే అది సోనియా, రాహుల్ గాంధీల కృషే. హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌ ను పునఃప్రారంభించేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. దీనికి సంబంధించి రేపు సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ అడుగుతాను’ అని జగ్గారెడ్డి తెలిపారు.

    రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేదేలేదని..

    కాగా, జగ్గారెడ్డి తీరు గత కొద్దిరోజులుగా కాంగ్రెస్​ శ్రేణులను ఇబ్బంది పెట్టేదిలాగానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానంటూ ఏకంగా సోనియా గాంధీకే లేఖ రాసిన జగ్గారెడ్డి.. అందులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అసాధారణ ఆరోపణలు గుప్పించారు. పీసీసీ చీఫ్ పదవి పైసలకు అమ్ముడుపోయిందని లేఖలో గట్టిగా నొక్కి చెప్పడం వల్ల జగ్గారెడ్డి ఉద్దేశపూర్వకంగానే క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లయింది. తన లేఖను ఢిల్లీ పెద్దలు పట్టించుకున్నా, తేలికగా తీసుకున్నా రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేదేలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పటికిప్పుడు జగ్గారెడ్డి అటు టీఆర్ఎస్ లోనూ చేరలేని పరిస్థితి నెలకొన్నందున స్వతంత్రంగానే ఉంటానని, ప్రజాసేవ కొనసాగిస్తానని చెప్పుకున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, Jagga Reddy, Telangana Assembly, Telangana Budget 2022, Telangana jobs, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు