‘కాంగ్రెస్ వల్లే మంత్రిగా హరీశ్ రావు’

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే హరీశ్‌ రావు అడ్రస్ ఎక్కడ ఉండేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. హరీశ్ రావుకు మంత్రి అయ్యే అవకాశం కూడా కాంగ్రెస్ వల్లే వచ్చిందని ఆయన అన్నారు.

news18-telugu
Updated: December 16, 2019, 5:42 PM IST
‘కాంగ్రెస్ వల్లే మంత్రిగా హరీశ్ రావు’
హరీష్ రావు (File)
  • Share this:
మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్‌పై పెద్ద పెద్ద మాటలు మానుకోవాలని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచించారు. కాంగ్రెస్ ముందు హరీశ్ రావు వయసు చానా చిన్నదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఉండదనే మాట హరీశ్ రావు కలలో కూడా నిజం కాదని మీడియాతో జరిపిన చిట్ చాట్‌లో అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే హరీశ్‌ రావు అడ్రస్ ఎక్కడ ఉండేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. హరీశ్ రావుకు మంత్రి అయ్యే అవకాశం కూడా కాంగ్రెస్ వల్లే వచ్చిందని ఆయన అన్నారు. హరీశ్ రావు రెండోసారి మంత్రి అవ్వడం కూడా సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లనే జరిగిందనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని అన్నారు.

మామ మెప్పుకోసం కాంగ్రెస్‌పై రాజకీయ విమర్శలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అంటే ఏంటో కేసీఆర్‌కి పూర్తి అవగాహన ఉందని జగ్గారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలమే హరీశ్ రావు డ్రామాలు కొనసాగుతాయని... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన డ్రామాలు కనుమరుగవుతాయని అన్నారు.అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని జగ్గారెడ్డి అన్నారు.


First published: December 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>