• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • SANGAM DAIRY SERVERS HACKED BY SOME PRIVATE PERSONS TENSION SITUVATION IN ANDHRA PRADESH NGS

Andhra Pradesh: సంగంపై భారీ కుట్ర జరుగుతోందా? హ్యాకింగ్ కు గురైన సర్వర్లు.. సిబ్బంది ఆందోళన

Andhra Pradesh: సంగంపై భారీ కుట్ర జరుగుతోందా? హ్యాకింగ్ కు గురైన సర్వర్లు.. సిబ్బంది ఆందోళన

సంగం సర్వల హ్యాకింగ్

సంగం డెయిరీలో ఏదో జరుగుతోందనే అనుమానాలు పెరుగుతున్నాయి. తాజాగా కోర్టు తీర్పు వచ్చిన కాసేపటికే సర్వర్లు హ్యాకింగ్ కు గురికావడం పై సిబ్బంది, యాజమాన్యం ఆందోళనకు దిగింది. కావాలనే తమ డేటాను హ్యాక్ చేస్తున్నారని యాజమాన్యం ఆరోపిస్తోంది.

  • Share this:
    సంగం డెయిరీలో ఏం జరుగుతోంది. డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల అరెస్ట్ దగ్గర నుంచి చాలా దూకుడుగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అయితే ఆ దూకుడుకి  ఏపీ హైకోర్టు బ్రేకులు వేసింది. సంగం డెయిరీ స్వాధీనంపై జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. సంగం డెయిరీ స్వాధీనంపై ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. డెయిరీ కార్యకలాపాలను డైరెక్టర్లు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రోజువారీ కార్యకలాపాలను డైరెక్టర్లు పర్యవేక్షించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. అలాగే సంగం డెయిరీ ఆస్తుల అమ్మకంపై కోర్టు అనుమతి తీసుకోవాలని చెప్పడంతో  ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేకులు పడినట్టే.

    తాజాగా సంగం డైరీ దగ్గర పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తమ కీలక సర్వర్లు హ్యాకింగ్ కు గురయినట్లు గుర్తించింది సంగం ఐటీ విభాగం. సర్వర్లు యాక్సిస్ పై ఇప్పటికే ఏసీబీ- సంగం మధ్య వివాదం ముదిరింది. ఇదే సమయంలో సర్వర్లు ఒక్కసారిగా హ్యాకింగ్ కు గురి కావడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో డెయిరీ బయట ఆందోళనకు దిగారు సిబ్బంది. రోజువారీ డేటా హ్యాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మండిపడుతున్నారు. వెంటనే పోలీసులు అక్రమ సోదాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

    ప్రైవేటు వ్యక్తులను సర్వర్ రూమ్ లోకి అనుమతిచడంపై గతంలోనే సంగం ఉద్యోగుల అభ్యంతరం తెలిపారు. ప్రైవేటు వ్యక్తులను నిలువరించిన రెండో రోజే హ్యాకింగ్ జరిగిందని... ఇది ప్రభుత్వం వెనుక ఉండి నడిపిస్తున్న కుట్ర అని యాజమాన్యం ఆరిపోస్తుంది. సర్వర్లలో కీలక డేటా కోసం పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని ఆందోళనకు దిగారు. హ్యాకింగ్ ను అడ్డుకోవడంతో ఏకంగా ఫోన్లు చేసి సంగం ఐటీ సిబ్బందిని బెదిరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. సిబ్బంది ఆందోళనలను పట్టించుకోకుండా.. సర్వర్లను తరలించే ప్రయత్నంలో పోలీసులు ఉండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే సర్వర్ రూమ్ వద్దకు చేరుకున్న ఏసీబీ, పోలీసులకు సంగం ఉద్యోగులతో వాగ్వివాదం జరిగింది. కోర్ట్ ఆర్డర్స్ రాక ముందే సర్వర్లను తరలించే ప్రయత్నం చేస్తున్నారని యాజమాన్యం ఆరిపోస్తుంది.

    కొద్ది రోజుల క్రితం.. సంగం డెయిరీలో అక్రమాలంటూ… ధూళిపాళ్లను తెల్లవారుజామునే అరెస్ట్ చేసి..రెండు రోజులకే… సంగం డెయిరీకి ఉన్న మిల్క్ ప్రొడ్యూసర్స్ అనుమతిని రద్దు చేస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. అక్కడితో ఆగకుండా సంగం డెయిరీ యాజమాన్య హక్కులను మార్చేసింది. సంగం డెయిరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది.

    అలాగే రోజువారీ వ్యవహారాలను చూసే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు ఇప్పగించింది. డెయిరీ రోజువారీ వ్యవహారాలను ఆయనే చూస్తున్నారు. సంగం డెయిరీ కంపెనీల చట్టం పరిధిలో ఉంది. అయితే ఆ చట్టంలోకి అక్రమంగా మార్చారని .. సంతకాలు ఫోర్జరీ చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. గతంలో ఈ అంశంపై నోటీసులు జారీ చేసింది. అయితే సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.

    ఇప్పుడు అదే అంశాలపై మళ్లీ కేసులు పెట్టి రాత్రికి రాత్రి ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయడమే కాకుండా.. ఇంకా అక్రమాలు జరిగాయో లేదో నిర్ధారణ కాకుండానే.. సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం.

    ధూళిపాళ్ల స్థానంలో కొత్త చైర్మన్‌ను ఎన్నుకున్న డైరక్టర్లు.. ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమని హైకోర్టును ఆశ్రయించారు. న్యాయవ్యవస్థను కూడా పట్టించుకోకుండా.. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అన్ని రకాల హద్దులను దాటేసిందని కోర్టుకు తెలిపారు.

    దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. కొత్త జీవో చెల్లదంటే స్పష్టం చేసింది. ఇప్పుడు ఆ జీవో చెల్లదని హైకోర్టు స్పష్టంచేయడంతో మళ్లీ కార్యకలాపాలు.. డైరక్టర్ల చేతికి వస్తాయి. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న విషయాలపై మినహా.. మరేఇతర అంశాలపై సోదాలు చేయవద్దని… కంపెనీ మార్కెటింగ్.. పాల ఉత్పత్తి.. సేకరణ వంటి అంశాలపై అసలు జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. అయినా సర్వర్లను తీసుకెళ్లడమేంటని యాజమాన్యం, సిబ్బంది నిలదీస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: