విజయవాడలో ఇసుక మార్చ్... ఏపీ మంత్రి చెప్పారన్న సీపీఐ

ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రులు వ్యంగంగా మాట్లాడారని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు.

news18-telugu
Updated: November 9, 2019, 3:04 PM IST
విజయవాడలో ఇసుక మార్చ్... ఏపీ మంత్రి చెప్పారన్న సీపీఐ
ఇసుక పక్కదారి పట్టకుండా గ్రామ కార్యదర్శి పర్యవేక్షించాలి.
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతను సృష్టించింది ప్రభుత్వమే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రులు వ్యంగంగా మాట్లాడారని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయనగరంలో పోలీసులు కుమ్మకై ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా చెప్పారని రామకృష్ణ ఆరోపించారు. 12వ తేదీన ఉచిత ఇసుకను ఇవ్వాలని వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో ఇసుక మార్చ్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

13వ తేదీన వామపక్ష నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా మార్చ్ నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. వెలుగు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే కొత్త ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగాల కల్పనేమో కానీ ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారని మండిపడ్డారు.
Published by: Kishore Akkaladevi
First published: November 9, 2019, 2:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading