ఎన్టీఆర్‌కు జరిగినట్టే.. చంద్రబాబుకూ జరిగింది..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు ఎదురైన అవమానం ఇప్పుడు చంద్రబాబునాయుడుకి కూడా ఎదురైంది.

news18-telugu
Updated: November 28, 2019, 4:29 PM IST
ఎన్టీఆర్‌కు జరిగినట్టే.. చంద్రబాబుకూ జరిగింది..
చంద్రబాబు
  • Share this:
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు ఎదురైన అవమానం ఇప్పుడు చంద్రబాబునాయుడుకి కూడా ఎదురైంది. 1994 ఆగస్ట్ సంక్షోభం సమయంలో ఓ హోటల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలను కలిసేందుకు వచ్చిన ఎన్టీఆర్ మీద అప్పట్లో కొందరు చెప్పులు విసిరారు. అది పెద్ద దుమారానికి దారి తీసింది. చంద్రబాబునాయుడు ప్రత్యర్థులు ఆ పనిని ఆయనే చేయించారని ఆరోపిస్తారు. అయితే, ఇప్పుడు చంద్రబాబునాయుడుకి అలాంటి ఘటన ఎదురైంది. అమరావతిలో పర్యటిస్తున్న నారా చంద్రబాబునాయుడి కాన్వాయ్ మీద కొందరు చెప్పులు విసిరారు. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలను పరిశీలించేందుకు వెళ్తున్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కాన్వాయ్‌పై కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులతో దాడికి దిగారు. నల్ల జెండాలు ప్రదర్శిస్తూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading