ఇంటి భోజనం కావాలన్న చిదంబరం...కోర్టు రియాక్షన్ ఇదీ..

కోర్టు వ్యాఖ్యలపై కలగజేసుకున్న కపిల్ సిబల్.. చిదంబరానికి 74 ఏళ్లని, ఆయన విజ్ఞప్తిని పరిశీలించాలని మరోసారి కోరారు.

news18-telugu
Updated: September 12, 2019, 5:42 PM IST
ఇంటి భోజనం కావాలన్న చిదంబరం...కోర్టు రియాక్షన్ ఇదీ..
న్యూస్ 18 క్రియేటివ్
news18-telugu
Updated: September 12, 2019, 5:42 PM IST
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్న చిదంబరానికి మరో షాక్ తగిలింది. ఇంటి భోజనానికి అనుమతివ్వాలన్న చిదంబరం విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. గురువారం చిదంబరం రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణం జరిగింది. ఈ సందర్భంగా ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అనుమతించాలని ఆయన తరపు లాయర్ కపిల్ సిబాల్ కోరారు. ఐతే చట్టం ముందు అందరూ సమానమే అని.. తీహార్ జైల్లో అందరికీ ఎలాంటి ఆహారం అందిస్తారో, అదే ఆహారాన్ని చిదరంబరానికి అందిస్తారని కోర్టు స్పష్టంచేసింది.

కోర్టు వ్యాఖ్యలపై కలగజేసుకున్న కపిల్ సిబల్.. చిదంబరానికి 74 ఏళ్లని, ఆయన విజ్ఞప్తిని పరిశీలించాలని మరోసారి కోరారు. ఇదే జైల్లో చౌతెలా కూడా ఉంటున్నారని.. ఆయన కూడా రాజకీయ ఖైదీనేని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా అన్నారు. తోటి ఖైదీలకు పెట్టే భోజనాన్నే.. ఆయనా తింటున్నారని చెప్పుకొచ్చారు. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ సురేష్ కుమార్..చిదంబరానికి ఇంటి భోజనాన్ని తిరస్కరించారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు.
First published: September 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...