అదే వైఖరి.. ఆర్టీసి కార్మికులను తిరిగి తీసుకునేది లేదు : సీఎం కేసీఆర్

TSRTC Strike : సమ్మెకు దిగిన ఆర్టీసీ యూనియన్లతో చర్చలు లేవని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సంస్థకు రూ.150కోట్ల నష్టం జరిగిందన్నారు.

news18-telugu
Updated: October 17, 2019, 10:26 AM IST
అదే వైఖరి.. ఆర్టీసి కార్మికులను తిరిగి తీసుకునేది లేదు : సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ (File Photo)
  • Share this:
సమ్మెకు దిగిన ఆర్టీసీ యూనియన్లతో చర్చలు లేవని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సంస్థకు రూ.150కోట్ల నష్టం జరిగిందన్నారు. గడువులోగా విధుల్లో చేరని కార్మికులను తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. త్వరలోనే కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అద్దె బస్సులను మరిన్ని పెంచి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. అద్దె బస్సులు అక్కడక్కడా ప్రమాదాలకు గురవుతున్నాయని.. అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆర్టీసీకి ఎండీని నియమించాలన్న హైకోర్టు ఆదేశాలతో కేసీఆర్ విబేధించారు. ఓవైపు నష్టాలు.. మరోవైపు కార్మికులు సమ్మెలో ఉన్నవేళ.. కొత్త ఎండీని నియమించడం కష్టమని కేసీఆర్ అధికారులతో చెప్పినట్టు సమాచారం. బుధవారం రవాణా మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ అధికారులతో కేసీఆర్ మాట్లాడారు.

ఆర్టీసీ కార్మికులకు 44శాతం ఫిట్‌మెంట్,16శాతం ఐఆర్ ఇచ్చి బాగా చూసుకున్నామని.. అయినప్పటికీ వారు సమ్మె బాట పట్టడం సబబు
కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కార్మికుల సమ్మెను ఉపేక్షించాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ వాదనను హైకోర్టులో గట్టిగా వినిపించాలని.. కోర్టులో సమ్మె వ్యవహారాన్ని తేల్చాలని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక.. ఆర్టీసీ కార్మికులకు ఏమేమి చేసిందో అవన్నీ కోర్టుకు వివరించాలని సూచించారు. ఇక సీఎం ఆదేశిస్తే చర్చలకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానన్న కేకే మాటలను కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. సమీక్షా సమావేశంలో ఆయన పేరు ప్రస్తావనకు కూడా రాలేదని సమాచారం.

First published: October 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు