SAMAJWADI PARTY PRESIDENT UTTAR PRADESH EX CM AKILESH YADAV CLARIFIES ON ALLIANCE AK
బాబాయ్‌తో అఖిలేష్ కాంప్రమైజ్.. పొత్తులపై క్లారిటీ
అఖిలేష్ యాదవ్ (ఫైల్ ఫోటో)
ఉత్తరప్రదేశ్‌లో రెండేళ్ల తరువాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద పార్టీలో పొత్తు పెట్టుకోబోమని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు.
బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఫలితాలు చూసిన తరువాత క్లారిటీ వచ్చిందో లేక ముందుగానే ఫిక్స్ అయ్యారో తెలియదు కానీ.. ఉత్తరప్రదేశ్‌లో రెండేళ్ల తరువాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద పార్టీలో పొత్తు పెట్టుకోబోమని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. అయితే ఎస్పీ బహిష్కృత నేత, తన బాబాయ్ శివపాల్ యాదవ్‌తో కాంప్రమైజ్ అయిన విషయాన్ని ఆయన తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో తన బాబాయ్‌పై అభ్యర్థిని నిలపబోమని అఖిలేష్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే... తన బాబాయ్ శివపాల్ యాదవ్‌కు కేబినెట్లో చోటు ఖాయమని వివరించారు.
ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ హవా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన బీజేపీ.. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించి దేశంలోని పెద్ద రాష్ట్రంపై తన పట్టు నిలుపుకుంది. ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు కలిసి పోటీ చేసినా.. బీజేపీ దూకుడును అడ్డుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగాలని... కాంగ్రెస్, బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవద్దని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
అయితే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల పెద్దగా లాభం లేదని ఇటీవల బీహార్ ఎన్నికలు నిరూపించాయని.. అందుకే పెద్ద పార్టీలో పొత్తు పెట్టుకోవద్దనే నిర్ణయానికి ఎస్పీ వచ్చిందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే కలిసికట్టుగా బీజేపీని ఓడించలేకపోయిన సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు వేర్వేరుగా బరిలోకి దిగి బీజేపీని ఓడించగలుగుతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.