లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన ఎంపీ ఆజం ఖాన్..

Lok Sabha: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్ ఈ రోజు లోక్‌సభ వేదికగా డిప్యూటీ స్పీకర్ రమాదేవికి క్షమాపణ చెప్పారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 29, 2019, 12:11 PM IST
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన ఎంపీ ఆజం ఖాన్..
అజం ఖాన్ (File)
  • Share this:
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ రమాదేవిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్ ఈ రోజు లోక్‌సభ వేదికగా ఆమెకు క్షమాపణ చెప్పారు. సోమవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడుతూ.. ‘నాకు డిప్యూటీ స్పీకర్‌పై ఎలాంటి దురుద్దేశం లేదు. సభలోని ప్రతీ ఒక్కరికి నేనేం మాట్లాడానో తెలుసు. నా వ్యక్తిత్వం గురించి తెలుసు. అయితే, నేను తప్పు చేశానని సభ భావిస్తే అందుకు క్షమాపణ చెబుతున్నా’ అని తెలిపారు. సభ ప్రారంభం అయ్యే కంటే ముందు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రమాదేవికి ఆజంఖాన్ క్షమాపణ చెప్పారు.


అయితే, ఆజంఖాన్ క్షమాపణ అభ్యర్థనను రమాదేవి తిరస్కరించారు. ఆయన ప్రవర్తన దేశాన్ని, మహిళల్ని కించపరిచే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. చాలా సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఆయన ఎప్పటికీ మారరని అన్నారు. ‘ఆయన తన ప్రవర్తనను మార్చుకోవాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. అది మార్చుకోవాల్సిందే’ అని రమాదేవి స్పష్టం చేశారు.


First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు