Talibans: తాలిబన్లను వెనుకేసుకొచ్చిన సమాజ్‌వాదీ ఎంపీ.. దేశ స్వాతంత్ర్యంతో పోల్చుతూ..

ప్రతీకాత్మక చిత్రం

Talibans: భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు, మన దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడిందని.. ఇప్పుడు తాలిబాన్ తమ దేశాన్ని విడిపించి దానిని నడపాలని కోరుకుంటోందని ఎస్పీ ఎంపీ రెహమాన్ బార్క్ అన్నారు.

 • Share this:
  ఆఫ్ఘనిస్థాన్‌ మళ్లీ తాలిబన్ల హస్తగతం కావడంతో అక్కడ భయానక పరిస్థితులు మొదలయ్యాయి. మళ్లీ తాము రెండు దశాబ్దాల కిందటి దారుణమైన పరిస్థితులు చవిచూడాల్సి వస్తుందేమో అనే భయంలో అనేక మంది ప్రజలు వేరే దేశాలకు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు పరుగులు తీస్తున్నారు. విమానంపైన కూర్చుని వెళ్లేందుకు కూడా వెనకాడటం లేదు. అలాంటి తాలిబన్లను మన దేశానికి చెందిన సమాజ్‌వాదీ ఎంపీ షఫీఖర్ రెహమాన్ బార్క్ వెనకేసుకొచ్చారు. తాలిబాన్లు తమ దేశ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని, ఆఫ్ఘన్ ప్రజలు దాని నాయకత్వంలో స్వేచ్ఛ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు తాలిబన్ల పోరాటాన్ని భారతదేశ స్వాతంత్ర్య పోరాటంతో పోల్చారు.

  భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు, మన దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడిందని.. ఇప్పుడు తాలిబాన్ తమ దేశాన్ని విడిపించి దానిని నడపాలని కోరుకుంటోందని అన్నారు. తాలిబాన్లు తమ దేశాన్ని విడిపించాలని కోరుకుంటున్నారని, అయితే అది తాలిబాన్ల అంతర్గత విషయం ఎంపీ రెహమాన్ బార్క్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యం అనేది వారి వ్యక్తిగత విషయమని అన్నారు. అసలు అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లో ఎందుకు పరిపాలన చేస్తుందని ప్రశ్నించారు.

  తాలిబన్లు అక్కడ ఒక శక్తి అని ఆఫ్ఘన్ ప్రజలు దాని నాయకత్వంలో స్వేచ్ఛను కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఎంపీ రెహమాన్ బార్క్ వ్యాఖ్యలను యూపీ డిప్యూటీ సీఎం మౌర్య తప్పుబట్టారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు సమాజ్‌వాదీ నాయకులకు ఎలాంటి తేడా లేదని విమర్శించారు. రెండు రోజుల క్రితం తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించి అధ్యక్ష భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: