SAKSHI IT PRESIDENT DIVYA REDDY SHOWS THE BEST PERFORMANCE FOR THE WINNING OF YCP AND JAGAN IN ANDHRA PRADESH NK
వైసీపీ అద్భుత విజయం వెనక మహిళా శక్తి... ఎవరో తెలుసా...
AP New CM YS Jagan : ఏపీలో ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ర్యాలీలూ అన్నీ తెరపై కనిపించేవే. ఐతే, తెరవెనక కథ నడిపించిన మహిళా శక్తిగా ఇప్పుడు దివ్యా రెడ్డిని చెప్పుకుంటున్నారు.
AP New CM YS Jagan : ఏపీలో ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ర్యాలీలూ అన్నీ తెరపై కనిపించేవే. ఐతే, తెరవెనక కథ నడిపించిన మహిళా శక్తిగా ఇప్పుడు దివ్యా రెడ్డిని చెప్పుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఏకంగా 151 సీట్లను గెలుచుకోవడం యావత్ దేశాన్నే ఆశ్చర్య పరిచింది. అసలు ఇంతటి ఘన విజయం ఎలా సాధ్యమైందని ఇప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఆసక్తిగా ఇక్కడి రాజకీయాల్ని గమనిస్తున్నారు. ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఐదోసారి సీఎంగా గెలిచినా... దాని కంటే జగన్ సాధించిన విజయంపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. కారణం... బలమైన టీడీపీని అత్యంత బలహీనమైన పార్టీగా మార్చేయడంలో జగన్ సాధించిన విజయం అనిర్వచనీయమైనదంటున్నారు రాజకీయ పండితులు. సరే ఆ విషయం అలా ఉంచితే, అసలు జగన్ ఇంతలా గెలవడం వెనక రాయకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తోపాటూ... మరో మహిళ కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఆమె ఎవరో కాదు... సాక్షి ఐటీ ప్రెసిడెంట్ దివ్యారెడ్డి.
దివ్యారెడ్డి (Image : Youtube / Sakshi
దివ్యారెడ్డి... వైసీపీకి సోషల్ మీడియా హెడ్‌గా పనిచేస్తున్నారు. ఆరు నెలల కిందటే ఆమె ఈ ప్రాజెక్టుకు హెడ్ అయ్యారు. అప్పటి నుంచీ రెస్ట్ లేకుండా పనిచేశారు. ఐతే... అప్పటికే టీడీపీ సోషల్ మీడియాలో చాలా ముందుంది. ప్రత్యేక వెబ్సైట్తోపాటూ... సోషల్ మీడియా సెల్‌ని పెట్టుకొని... ప్రభుత్వ పథకాలు, ఇతరత్రా కార్యక్రమాలపై జోరుగా ప్రచారం సాగిస్తూ ఉంది. అలాంటి సమయంలో ఎంట్రీ ఇచ్చిన దివ్యారెడ్డి... అసలేంటి టీడీపీ గొప్పదనం... నిజంగానే ఆ పథకాలన్నీ అమలవుతున్నాయా... టీడీపీ చెబుతున్న వాటిలో నిజానిజాలేంటి? టీడీపీ ఎక్కడెక్కడ ఫెయిలవుతోంది? ఇలా ప్రతీ అంశాన్ని వేర్వేరుగా డీల్ చేస్తూ... ప్రత్యేక సోషల్ మీడియా టీంని డెవలప్ చేశారు. ఆ టీంతో ప్రతి రోజూ కాంటాక్ట్ అవుతూ... ఎలా ముందుకెళ్లాలి. జగన్ చెప్పే మాటల్ని ఎలా జనంలోకి తీసుకెళ్లాలి. పాదయాత్రల్లో హామీలు, నవరత్నాలపై ఎలా ప్రచారం చెయ్యాలి అనే అంశాలపై క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు.
పార్టీ నేతలతో వైఎస్ జగన్
జగన్, వైసీపీ గురించి చెప్పడమే కాదు... టీడీపీ కౌంటర్లకు రివర్స్ కౌంటర్లు ఇవ్వడం, చంద్రబాబు చెప్పే మాటలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వడం, ఇలా ప్రతీ అంశంలోనూ సోషల్ మీడియాలో వైసీపీ దూసుకెళ్లేలా చెయ్యడంలో దివ్యారెడ్డి కృషి ఎంతో ఉంది. అప్పటివరకూ టీడీపీకి సంబంధించిన కామెంట్లే ఎక్కువగా కనిపిస్తూ ఉన్న సోషల్ మీడియాను దివ్యారెడ్డి... తాను వచ్చాక, వైసీపీ స్పీడ్ పెరిగేలా, వైసీపీ ట్యాగ్ లైన్స్ కనిపించేలా చెయ్యడంలో సక్సెస్ అయ్యారు.
ఎన్నికలు జరగబోయే చివరి నెల రోజుల్లో దివ్యారెడ్డి చేసిన కృషికి పార్టీలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆ టైంలో జగన్తోపాటూ... పార్టీలోని అందరు అభ్యర్థులపై ప్రతి ఒక్కరికీ మెసేజ్‌లు, ప్రొఫైల్స్ చేరేలా దివ్యారెడ్డి బలమైన గ్రౌండ్ వర్క్ చేశారు. ఫలితంగా వైసీపీ విధానాలు, హామీలు, పథకాలు, అభ్యర్థులు, ప్రచార సరళి, సభలు, సమావేశాలు, ఇలా అన్ని అంశాలూ ఎప్పటికప్పుడు పల్లె పల్లెకూ ఫోన్లు, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా చేరిపోయాయి. ఇలా ఓవైపు ప్రశాంత్ కిషోర్, మరోవైపు దివ్యా రెడ్డి... ఎవరి వంతు వారు గట్టిగా ప్రయత్నించడంతో... చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది వైసీపీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.