Home /News /politics /

SAJJALA RAMAKRISHNA REDDY SLAMS SEC NIMMAGADDA RAMESH KUMAR AND TDP CHIEF CHANDRA BABU NAIDU OVER PANCHAYAT ELECTIONS PROCESS PRN

YSRCP vs TDP: చంద్రబాబుకు షాకిచ్చే పనిలో వైసీపీ... టీడీపీ మేనిఫెస్టోపై కోర్టుకు వెళ్తామన్న సజ్జల

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్ ఫోటో)

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్ ఫోటో)

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh kuamr) కు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (YSR Congress Party) మధ్య యుద్ధం నడుస్తోంది. నిమ్మగడ్డ లేఖలు సంధిస్తుంటే.., వైసీపీ నేతలు మాత్రం ప్రెస్ మీట్లతో మాటల తూటాలు పేలుస్తున్నారు

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలపై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య యుద్ధం నడుస్తోంది. నిమ్మగడ్డ లేఖలు సంధిస్తుంటే.., వైసీపీ నేతలు మాత్రం ప్రెస్ మీట్లతో మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సంబంధాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.., ఎస్ఈసీపై మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్నారని ఆరోపించారు. నిమ్మగడ్డ తన లిమిట్స్ ను ఎప్పుడో దాడిపాయారని విమర్శించిన సజ్జల.., రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది ఎవరో తెలిసిపోతోందన్నారు. కేవలం తన ఈగో కోసమే ఐఏఎస్ అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇక చంద్రబాబు విడుదల చేసిన మెనిఫెస్టోపైనా కౌంటర్ల మీద కౌంటర్లు వేశారు సజ్జల.

    చంద్రబాబు మాటలను నమ్మి అనవసరంగా ఇబ్బందులు పడుతున్నారని సజ్జల అన్నారు. టీడీపీ ఆఫీస్ లోకూర్చొని మాట్లాడితే తప్పులేదని.., కానీ ఎస్ఈసీ కుర్చిలో కూర్చొని విమర్శలు చేయడమేంటన్నారు. వైసీపీ నేతలు, మంత్రులు తనను దూషించారని ఫిర్యాదులు చేస్తున్న నిమ్మగడ్డ... తమను గూండాలంటూ సంబోధించడం సరైందేనా? అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన మేనిఫెస్టోపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామని.., దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు.

    420 మేనిఫెస్టో
    పంచాయతీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు.., ప్రజలను అడ్డగోలుగా మోసం చేస్తున్నారని సజ్జల విమర్శిచారు. మేం గెలిస్తే 100 గజాల స్థలంలో రూ.3 లక్షలకో ఇల్లు కట్టిస్తామనడం, ఆస్తిపన్ను తగ్గిస్తామనడం కంటే విడ్డూరం మరొకటి లేదని సజ్జల ఎద్దేవా చేశారు. పంచాయతీలు ఎక్కడైనా ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు కట్టిస్తాయా.., ఆస్తిపన్ను తగ్గించే అంశం పంచాయతీలకు ఉంటుటందా అని నిలదీశారు. తన పరిధిలో లేని వాటికి కూడా హామీలివ్వడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమన్న సజ్జల.., ఇది 200శాతం ప్రజలను మోసం చేయడమేనన్నారు. చంద్రబాబుకు ఛాన్సిస్తే స్కూల్ లీడర్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి మోసపూరిత హామీలిస్తారని కౌంటర్ వేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీపై 420 కేసు పెట్టి.., క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. మేనిఫెస్టో విషయంలో కోర్టుకు కూడా వెళ్తామని సజ్జల స్పష్టం చేశారు.

    ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్... గతంలో వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియను ఎందుకు ప్రారంభించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, AP News, Chandrababu naidu, Gram Panchayat Elections, Local body elections, Nimmagadda Ramesh Kumar, Sajjala ramakrishna reddy, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు