Sajjala Slams TDP: రిపీట్ అయితే రియాక్షన్ సీరియస్ గా ఉంటుంది.. టీడీపీకి సజ్జల వార్నింగ్...

సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వైఎస్ఆర్సీపీ (YSRCP), తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) స్పందించారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో వైఎస్ఆర్సీపీ (YSRCP), తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) స్పందించారు. కొంతకాలంగా టీడీపీ నేతలు రెచ్చగొట్టిన వ్యాఖ్యలు చేస్తున్నా సంయమనం పాటిస్తున్నామని సజ్జల అన్నారు. అధికార ప్రతినిథిగా ఉన్న పట్టాభి కావాలనే సీఎం జగన్ ను దూషించారన్నారు. పట్టాభి అలాంటి కామెంట్స్ చేయడం వెనుక చంద్రబాబు నాయుడు హస్తముందన్నారు. దీని వెనుక కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని ఆయన అన్నారు. పట్టాభి అన్న మాటకు చాలా దారుణమైన అర్ధముందని.. పదేపదే రిపీట్ చేస్తూ దుర్భాషలాడినట్లు ఆరోపించారు. ఒక అధికార పార్టీ ప్రతినిధి అలా మాట్లాడటం సరికాదని.. ఇలాంటి పదాలతో దూషించడం ఏ పార్టీ వారికీ సమంజసం కాదన్నారు. రాయలేని విధంగా బూతులు తిట్టడం ఏంటంటూ.. పట్టాభి వాడిన పదానికి అర్ధాన్ని కూడా వివరించారు సజ్జల. అలాంటి దారుణమైన మాటలు మాట్లాడటం వల్ల వచ్చిన స్పందనే టీడీపీ కార్యాలయంపై దాడి అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.

  పట్టాభి అలా మాట్లాడకపోయి ఉంటే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగి ఉండేది కాదన్నారు. జరిగినదాన్ని వక్రీకరించి లబ్ధిపొందాలని టీడీపీ చూస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనే తొందర చంద్రబాబుకు ఎందుకొచ్చిందని సజ్జల ప్రశ్నించారు. అమిత్ షాకు ఫోన్ చేశారని చెబుతున్నారని అందులో నిజముందో లేదన్నారు. టీడీపీ నేతలు కొంతకాలంగా కావాలనే ప్రభుత్వంపై, మంత్రులపై దూషణలకు దిగుతున్నారని సజ్జల ఆరోపించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎంపై, హోం మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.

  ఇది చదవండి: పట్టాభి వ్యాఖ్యలు సరికాదు.. చంద్రబాబు ఫోన్ లిఫ్ట్ చేశా.. డీజీపీ సవాంగ్ కామెంట్స్..


  ముఖ్యమంత్రిని పట్టుకొని నేరుగా బండబూతులు తిడితే రియాక్షన్ వచ్చిందని.. దీనికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, సీఎంను దూషించిన వారే బాధ్యత వహించాలని సజ్జల అన్నారు. చంద్రబాబే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చెప్పారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన ఘటనపై స్పందించిన పార్టీల నేతలను అలా తిడితే ఎలా ఉంటుందన్నారు. ఇప్పుడు ఇలాగే ఊరుకుంటే అత్యున్నత పదవుల్లో ఉన్నవారిని కూడా తిడతారని సజ్జల అన్నారు. ఇలాంటి తిట్లు చేతగాని దద్దమ్మలు, అసమర్ధులు, మాట మీద నిలబడలేనివారు, కావాలనే చేయాలనేవారు తిడతారన్నారు. ప్రజాస్వామ్యదేశంలో బూతులు తిడతారా అని సజ్జల ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటి ఘటనలే చోటు చేసుకునే అవకాశముందని సజ్జల హెచ్చరించారు.

  ఇది చదవండి: టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనలో ట్విస్ట్.. లోకేష్ పై హత్యాయత్నం కేసు..


  టీడీపీ నేతల మాట్లాడే మాటలగురించి వాళ్ల ఇళ్లకు వెళ్లి అడగాలనుకుంటున్నామన్నారు. దేనికైనా ఒక హద్దు ఉంటుందని... నిన్నటితో టీడీపీ ఆ హద్దును దాచేసిందన్నారు. టీడీపీకి ఒక పార్టీగా కొనసాగే అర్హతలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు చేసే విమర్శలన్నీ ఆనయకే వర్తిస్తాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దీక్షకు కూర్చునేముందు పట్టాభి వాడిన పదాలకు అర్ధాలు చెప్పి.. ఎవరైనా ఎవరిని ఉద్దేశించి అయినా అనొచ్చని చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ కు ఇలాంటి మాటలు తప్పులేదని అనిపించి ఉండొచ్చని సజ్జల ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొన్నిపార్టీలు భవిష్యత్తులో పొత్తుపెట్టుకోబోతున్నాయని.. వాళ్లే సీఎం జగన్ ను కావాలనే రెచ్చగొడుతున్నారన్నారు. వాళ్ల మాటలను తాము ఏమాత్రం లెక్కలోకి తీసుకొనే ప్రసక్తే లేదని సజ్జల స్పష్టం చేశారు.
  Published by:Purna Chandra
  First published: