ఏపీ కాంగ్రెస్‌కు కొత్త చీఫ్... మాజీమంత్రికి ఛాన్స్

గత అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏపీ పీసీసీ చీఫ్‌గా ఉన్న రఘువీరారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవి ఖాళీగానే ఉంది.

news18-telugu
Updated: January 16, 2020, 4:49 PM IST
ఏపీ కాంగ్రెస్‌కు కొత్త చీఫ్... మాజీమంత్రికి ఛాన్స్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఏపీ పీసీసీ చీఫ్ పదవిని ఎట్టకేలకు భర్తీ చేసింది ఏఐసీసీ. మాజీమంత్రి శైలజానాధ్‌ను ఏపీ పీసీసీ చీఫ్‌గా నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏపీ పీసీసీ చీఫ్‌గా ఉన్న రఘువీరారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవి ఖాళీగానే ఉంది. ఈ పదవి కోసం ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఆయనతో పాటు కేవీపీ రామచంద్రరావు వైపు కాంగ్రెస్ అధినాయకత్వం మొగ్గు చూపుతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈ పదవిని అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన శైలాజానాధ్‌ను ఎంపిక చేసింది. ఏపీ పీసీసీ చీఫ్‌గా శైలాజానాధ్‌ను నియమించిన కాంగ్రెస్ హైకమాండ్... వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, తులసిరెడ్డిలను నియమించింది.
First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>