Home /News /politics /

SADINENI YAMINI JOINS BJP IN PRESENCE OF CENTRAL MINISTER GAJENDRA SINGH SHEKHAWAT IN KADAPA PRO CAA RALLY BA

మాజీ టీడీపీ నేత సాధినేని యామిని శర్మ కొత్త ప్రయాణం...

సాధినేని యామిని (sadineni yamini)

సాధినేని యామిని (sadineni yamini)

తెలుగుదేశం పార్టీ మాజీ నాయకురాలు సాధినేని యామిని శర్మ బీజేపీలో చేరారు. గత ఏడాది నవంబర్‌లో ఆమె టీడీపీకి గుడ్ బై కొట్టారు.

    తెలుగుదేశం పార్టీ మాజీ నాయకురాలు సాధినేని యామిని శర్మ బీజేపీలో చేరారు. గత ఏడాది నవంబర్‌లో ఆమె టీడీపీకి గుడ్ బై కొట్టారు. అప్పుడే ఆమె బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే, అప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీతోనూ కలవకుండా ఉన్న యామిని శర్మ ఈ రోజు కాషాయకండువా కప్పుకొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏకి అనుకూలంగా కడపలో బీజేపీ భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీకి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ ర్యాలీలోనే యామిని శర్మ బీజేపీలో చేరారు. గజేంద్ర సింగ్ షెకావత్ ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap bjp, Sadineni yamini

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు