news18-telugu
Updated: May 23, 2019, 5:08 PM IST
దిగ్విజయ్ సింగ్,సాధ్వీ ప్రజ్ఞా సింగ్
దేశ వ్యాప్తంగా 17వ లోక్సభ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన స్థానం మధ్య ప్రదేశ్లోని భోపాల్. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరుపున దిగ్విజయ్ సింగ్, బీజేపీ తరుపున సాధ్వీ ప్రజ్ఞా సింగ్ పోటీ చేయడంతో అందరి దృష్టి ఈ లోక్సభ నియోజకవర్గంపై కేంద్రకృతమైంది. అప్పట్లో హిందూ ఉగ్రవాదం అంటూ దిగ్విజయ్ సింగ్తో పాటు అప్పటి కేంద్ర మంత్రులు చిదంబరం, సుశీల్ కుమార్ షిండే తనపై అనవసర ఆరోపణలు మోపి జైలు పాలు చేసారని సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఆరోపణలు చేసింది.కాగా, మాలేగావ్ పేలుళ్లలో నిందితురాలిగా ఉన్న సాధ్వీ పై ఎన్ఐఏ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆమె బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బీజేపీ తరుపన భోపాల్ లోక్సభకు పోటీ చేసారు. ఐతే ఈ ఎన్నికల్లో సాధ్వీ వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు బీజేపీని తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన సంగతి తెలిసిందే కదా. ముంబాయి దాడులను ఎదుర్కొన్న హేమంత్ కర్కరే తన శాపం కారణంగానే చనిపోయాడని ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలకు టార్గెట్ అయింది. ఆ తర్వాత జాతిపిత మహాత్మ గాంధీతో పాటు.. ఆయన్ని హత్య చేసిన నాథూరాం గాడ్సే దేశ భక్తుడు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వివరణ కోరారు. తాజాగా ఈ ఎన్నికల్లో సాధ్వీ ప్రజ్ఞా సింగ్.. దిగ్విజయ్ సింగ్ పై లక్ష ఓట్లకు పై చిలుకు మెజారిటీ గెలిపొందారు. ఆమె గెలుపుపై బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
First published:
May 23, 2019, 5:08 PM IST