యువకుడిని చితకబాదిన ప్రగ్యా సింగ్ సాధ్వి అనుచరులు...పట్టపగలే దారుణం..

భోపాల్ లో అభ్యర్థిగా పేరు ప్రకటించినప్పటి నుంచి వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్న సాధ్వి ప్రగ్యా ఠాకూర్..తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. తనకు నల్ల జెండా చూపిన కారణంతో ఓ యువకుడిని సాధ్వి అనుచరులు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయంలోనే చితకబాదారు.

news18-telugu
Updated: April 23, 2019, 7:01 PM IST
యువకుడిని చితకబాదిన ప్రగ్యా సింగ్ సాధ్వి అనుచరులు...పట్టపగలే దారుణం..
ఎన్సీపీ కార్యకర్తను చితకబాదుతున్న సాధ్వి అనుచరులు
news18-telugu
Updated: April 23, 2019, 7:01 PM IST
బీజేపీ భోపాల్ అభ్యర్థి ఎంపీ సాధ్వీ ప్రగ్యా సింగ్‌ అనుచరులు రెచ్చిపోయారు. తమ నేతకు సాధ్వికి నల్ల జెండా చూపిన ఎన్సీపీ కార్యకర్తను చితకబాదారు. సాధ్వీ ప్రగ్యా సింగ్ తన అనుచరులతో కలిసి స్థానిక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయం వద్దకు వెళ్లగా, అక్కడ ఒక యువకుడు సాధ్వి ప్రగ్యా సింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్ల జెండా చూపించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన సాధ్వి అనుచరులు యువకుడిపై పిడిగుద్దలు వర్షం కురిపిస్తూ బయటికి లాక్కెళ్లారు.

ఇదిలా ఉంటే భోపాల్ నుంచి బరిలోకి దిగిన సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను ఎదుర్కొంటున్నారు. ఇటీవలే దివంగత పోలీస్ అధికారి హేమంత్ కర్కరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ప్రగ్యా సింగ్ ఠాకూర్ వార్తల్లో నిలిచారు.First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...