Home /News /politics /

SADHINENI YAMINI TAKES ON RAMGOPAL VARMA OVER LAXMIS NTR ISSUE MS

వర్మ ఓ సైకో డైరెక్టర్.. జగన్ మద్దతు పలకడం విడ్డూరం : సాధినేని యామిని

సాధినేని యామిని (File)

సాధినేని యామిని (File)

'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాను మే 1న ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేయబోతున్నట్లు వర్మ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రెస్‌మీట్‌ను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది.

ఇంకా చదవండి ...
    ఏపీ రాజకీయం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చుట్టూ తిరుగుతోంది. దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రెస్ మీట్‌ను అడ్డుకోవడాన్ని జగన్ వ్యతిరేకించగా.. టీడీపీ ఆయన్ను టార్గెట్ చేసింది. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని రాంగోపాల్ వర్మపై విమర్శలు గుప్పించారు. ఆర్జీవీ ఒక సైకో డైరెక్టర్ అని కామెంట్ చేశారు. ఒక సైకో డైరెక్టర్‌కు జగన్మోహన్ రెడ్డి మద్దతుగా నిలవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సాధినేని యామిని విమర్శలపై ఆర్జీవీ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

    కాగా, 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాను మే 1న ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేయబోతున్నట్లు వర్మ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రెస్‌మీట్‌ను పోలీసులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. రాంగోపాల్ వర్మను విజయవాడ పోలీసులు అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయం పంపించారు. దీంతో విజయవాడ వచ్చే హక్కు మాకు లేదా? అని రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. సినిమాకు సంబంధించిన భావప్రకటన స్వేచ్చను వ్యక్తం చేసే హక్కు లేదా అని నిలదీశారు.అయితే విజయవాడ పోలీసులు మాత్రం నగరంలో 144సెక్షన్ అమలులో ఉన్నందునా.. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రెస్ మీట్ నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. రద్దీ ప్రాంతంలో ప్రెస్ మీట్ శాంతిభధ్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని.. అందుకే ప్రెస్ మీట్‌కు అనుమతివ్వలేదని చెప్పారు.
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Lakshmis NTR, Ram Gopal Varma

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు