Sadhineni Yamini: అదంతా వారి కుట్రే... పార్టీ మార్పుపై సాధినేని యామిని క్లారిటీ..

సాధినేని యామిని (ఫైల్)

Sadhineni Yamini: సాధినేని యామిని బహుశా రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఆమె మాట్లాడే మాటలు తూటాల్లా పేలుతుంటాయి.

  • Share this:
    M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18

    సాధినేని యామిని బహుశా రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఆమె మాట్లాడే మాటలు తూటాల్లా పేలుతుంటాయి. యామిని మాటలకూ రీవర్స్ కౌంటర్ ఇవ్వాలన్న కష్టమే. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన యామిని.. 2019లో టీడీపీ ఘోర ఓటమి చవి చూడటంతో ఆమె బీజేపీలో చేరారు. ప్రస్తుతం అక్కడ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఐతే ఆమెపై ఇటీవల సోషల్ మీడియాలో ఓ ప్రచారం విస్తృతంగా సాగుతోంది. యామిని పార్టీ మారబోతున్నారని.. బీజేపీ అధినాయకత్వంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ముఖ్యనేతలతో ఆమె టచ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పి వైసీపీలే చేరిపోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఐతే పార్టీ మార్పు అంశంపై యామినీ స్పందించారు.

    సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై యామినిని న్యూస్18 సంప్రదించగా.. తనకు పార్టీ మారే ఆలోచనే లేదని ఆమె స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా ఖండించారు. తనకు బీజేపీ పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేవని.., పార్టీ అధిష్టానం తనకు ఎంతో స్వేచ్ఛనిచ్చిందన్నారు. పార్టీ అధిష్టానంలో తనకు సముచిత స్థానం లభించిందని చెప్పారు. తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారంలో నిజం లేదన్న ఆమె.. ఎవరో కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు టీడీపీ, వైసీపీలకు చెందిన వారు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారని అన్నారు.

    ఇది చదవండి: ఆ పార్టీలో జోరందుకున్న వారసుల హడావిడి.. సుపుత్రులను రంగంలోకి దించుతున్న ఎమ్మెల్యేలు వీరే..!



    తాను ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో కొనసాగుతానన్న సాధినేని యామిని.. టీడీపీలో ఉన్న స్వేచ్ఛ బీజేపీలో లేదన్న వాదనలు తోసిపుచ్చారు. బీజేపీ నేతలు ఆమెను పట్టించుకోకపోవడంతో పార్టీ ముఖ్య నేతలకు ఆమెకు గ్యాప్ వచ్చినట్లు వార్తలు అవాస్తమని చెప్పారు. భవిషత్తులో పార్టీ బలోపేతం కోసమే స‌న్నిహితుల‌తో చ‌ర్చ‌లు జరిపినట్లు ఆమె తెలిపారు. వైసీపీ పార్టీని చిత్తు చేయడమే తన ప్రధాన లక్ష్యం అని చెప్పారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నానన్న యామిని.. నేతలందరితో సఖ్యత ఉన్నట్లు తెలిపారు.
    Published by:Purna Chandra
    First published: