రాహుల్‌తో సచిన్ పైలట్ భేటీ.. రాజస్థాన్ రాజకీయాల్లో మరో మలుపు..

త్వరలోనే రాజస్థాన్ అసెంబ్లీ జరగనున్న నేపథ్యంలో సచిన్ పైలట్ రాజీకొచ్చారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

news18-telugu
Updated: August 10, 2020, 4:47 PM IST
రాహుల్‌తో సచిన్ పైలట్ భేటీ.. రాజస్థాన్ రాజకీయాల్లో మరో మలుపు..
అశోక్ గహ్లోత్, రాహుల్ గాంధీ, సచిన్ పైలట్ (ఫైల్ ఫొటో)
  • Share this:
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం డైలీ సిీరియల్‌ను తలపిస్తోంది. రోజు మలుపుతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్ రాజకీయాల్లో తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. కాంగ్రెస్ రెబల్ లీడర్ సచిన్ పైలట్ ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిశారు. రాహుల్ గాంధీ నివాసంలో రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీతో ఆయన భేటీ అయ్యారు. పార్టీలో చీలిక, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సచిన్ పైలట్ రాజీకొచ్చారన్న ఊహాగానాల నేపథ్యంలో వీరి సమావేశం హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే సానుకూల ప్రకటన వస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు.

కాగా, రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. సచిన్ పైలట్‌కు చెందిన వర్గం సీఎం అశోక్ గహ్లోత్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఆయన వైపు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తనకు సీఎం పదవి ఇవ్వాలని సచినల్ పైలట్ పట్టుబట్టారు. ఆ క్రమంలో పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో సచిన్ పైలట్‌ను పీసీసీ చీఫ్ పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాతం అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ నోటీసులు ఇవ్వడంతో.. ఈ వ్యవహారం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఐతే త్వరలోనే రాజస్థాన్ అసెంబ్లీ జరగనున్న నేపథ్యంలో సచిన్ పైలట్ రాజీకొచ్చారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.
Published by: Shiva Kumar Addula
First published: August 10, 2020, 4:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading