HOME »NEWS »POLITICS »sachin pilot in congress president race capt amarinder singh hints ba

రాహుల్ వారసుడు ఆయనేనా.. తెరపైకి యువనేత

రాహుల్ వారసుడు ఆయనేనా.. తెరపైకి యువనేత
రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా సచిన్ పైలట్ ప్రమాణస్వీకారం (file)

‘యంగ్ ఇండియాకు యువనాయకత్వం అవసరం. ఈ విషయాన్ని సీడబ్ల్యూసీ దృష్టిలో పెట్టుకోవాలి.’ అని పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ ట్వీట్ చేశారు.

  • Share this:
    కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి రాహుల్ గాంధీ వారసుడిని వెతికేపనిలో ఆ పార్టీ అధిష్టానం నిమగ్నమైంది. ఈ క్రమంలో యువనేతకు పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజస్తాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఉన్నట్టు సమాచారం. పంజాబ్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరేందర్ సింగ్ ట్వీట్‌ను బట్టి చూస్తే సచిన్ పైలెట్ కాంగ్రెస్ అధ్యక్షుడి రేసులో ఫస్ట్ ఉన్నారు. ‘అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాజీమానా చేయడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. అయితే, యంగ్ ఇండియాకు యువనాయకత్వం అవసరం. ఈ విషయాన్ని సీడబ్ల్యూసీ దృష్టిలో పెట్టుకోవాలి. దేశంలో ఉన్న యువతను, క్షేత్రస్థాయిలో ఆకట్టుకునేలా నాయకుడిని ఎంచుకోవాలి.’ అని కెప్టెన్ అమరేందర్ సింగ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌ను విశ్లేసిస్తే.. యువనాయకత్వానికి పగ్గాలు అప్పగించాలని ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలుకుబడి, గుర్తింపు ఉన్న యువనాయకుల్లో సచిన్ పైలెట్, జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. వారిద్దరిలో ఒకరిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంచుకునే అవకాశం ఉంది.

    కెప్టెన్ అమరేందర్ సింగ్ ట్వీట్






    మరోవైపు రాజస్తాన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ సమావేశం అయ్యారు. దీంతో సచిన్ పైలెట్‌కే పార్టీ పగ్గాలు అప్పగించే చాన్స్ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం రాజస్తాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ఉన్నారు. డిప్యూటీ సీఎంగా సచిన్ పైలెట్ వ్యవహరిస్తున్నారు. నిన్నటి వరకు అశోక్ గెహ్లాట్‌‌ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేస్తారనే ప్రచారం ఉంది. అయితే, ఇప్పుడు యువనాయకత్వం వైపు కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:July 06, 2019, 17:05 IST

    टॉप स्टोरीज