శబరిమలలో మహిళల ప్రవేశంపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. స్వామివారి దర్శనార్థం 10-50 ఏళ్ల బాలికలు, మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ గత సెప్టెంబరు 28న అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తీర్పును సమీక్షించాలంటూ 48 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వం ఇదివరకే ఇచ్చిన తీర్పుపై ఎలాంటి పున: సమీక్స చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు తెలిపింది.
మొత్తం ఐదుగురు న్యాయమూర్తులతో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం ఎదుట పిటిషనర్ల తరఫున పలువురు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కేరళ ప్రభుత్వం తరఫున న్యాయవాది జైదీప్ గుప్తా తన వాదనలు వినిపించారు. 'హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదన్నారాయన. దీన్ని కోర్టు గుర్తించింది. ఓ ఆలయ సంప్రదాయాన్ని మొత్తం మతాచారంగా చెబితే చట్ట ప్రకారం చెల్లదని పేర్కొన్నారు. దీన్ని ఆధారంగా చేసుకునే తీర్పును సమీక్షించమని కోరడం సరికాదన్నారు జైదీప్ గుప్తా. శబరిమల తీర్పుపై సమీక్ష అవసరం లేదని ఆయన కోర్టుకు తెలిపారు.
అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై 64 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే కోర్టు తీర్పును మాత్రం రిజర్వ్‌లో ఉంచింది. మరోవైపు ఈ వివాదంపై అటు శబరిమల ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు కూడా యూటర్న్ తీసుకుంది. అన్ని వయస్కుల మహిళల్ని ఆలయంలోకి అనుమతి ఇచ్చేందుకు అంగీకరించింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.