మంత్రి కేటీఆర్ చేసిన పనికి సాహో స్టార్ ప్రభాస్ ఫిదా

డెంగ్యూ, విష జ్వరాలు రాకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని కోరిన ప్రభాస్.. అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.

news18-telugu
Updated: September 10, 2019, 10:03 PM IST
మంత్రి కేటీఆర్ చేసిన పనికి సాహో స్టార్ ప్రభాస్ ఫిదా
కేటీఆర్, ప్రభాస్
  • Share this:
హీరో ప్రభాస్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు మద్దతు తెలిపారు. కేటీఆర్ చేసిన పనికి సాహో స్టార్ ఫిదా అయ్యారు. కేటీఆర్ తన ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న ఫొటోలను ఫేస్‌బుక్ ద్వారా పంచుకున్నారు ప్రభాస్. డెంగ్యూ, విష జ్వరాలు రాకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని కోరిన ప్రభాస్.. అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. కేటీఆర్ బాటలో నడిచి.. అందరూ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

తెలంగాణలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో ప్రజలు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ఆస్పత్రుల్లో ఎక్కువ మొత్తంలో ఇలాంటి కేసులే నమోదువున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ ఆరోగ్య సూచనలు చేశారు. వైరల్ ఫీవర్, డెంగ్యూ రాకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. నీటితొట్టెలు, పూలకుండీలు, ఎయిర్‌కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించారు కేటీఆర్.

దోమల వ్యాప్తికి ఇదే కారణమని కేటీఆర్ తెలిపారు. అందుకే తన ఇంటి పరిసరాలను తానే స్వయంగా శుభ్రం చేసినట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆ ఫొటోలను నెటిజన్లతో పంచుకున్నారు. మీరు కూడా ఇంటి పరిసరాలను క్లీన్ చేసి ఆ ఫొటోలను తనతో పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఆ ట్వీట్‌పై స్పందించిన ప్రభాస్.. కేటీఆర్ చేసిన పనిని మెచ్చుకున్నారు.

First published: September 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>