కాశ్మీర్‌పై చర్చ... పాకిస్థాన్ పార్లమెంట్‌లో గందరగోళం

కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వం చర్యను ఖండించేందుకు పాకిస్థాన్ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది.

news18-telugu
Updated: August 6, 2019, 4:32 PM IST
కాశ్మీర్‌పై చర్చ... పాకిస్థాన్ పార్లమెంట్‌లో గందరగోళం
ఇమ్రాన్ ఖాన్
news18-telugu
Updated: August 6, 2019, 4:32 PM IST
పాకిస్థాన్ పార్లమెంట్‌లో గందరగోళం చోటు చేసుకుంది. భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించడాన్ని పాకిస్థాన్ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ అంశంపై చర్చించేందుకు పాక్ ప్రభుత్వం అత్యవసరంగా పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మంగళవారం సమావేశమైన పాక్ జాతీయ అసెంబ్లీ భారత్ చర్యను ఖండిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే దీన్ని ఆమోదింజేందుకు ఆ దేశ విపక్షమైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నిరాకరించింది.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంలో ఆర్టికల్ 370 రద్దు అంశం లేకపోవడాన్ని పాకిస్థాన్ ప్రతిపక్షం తప్పుబట్టింది. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. సభను స్పీకర్ 20 నిమిషాల పాటు వాయిదా వేశారు. అయితే ప్రతిపక్షం తీరును పాక్ మంత్రి జరారీ తప్పుబట్టారు. ప్రతిపక్షం కేవలం సభలో గొడవ చేయడానికి మాత్రమే ఉందని... కాశ్మీర్ అంశంపై చర్చలో పాల్గొనడానికి కాదని విమర్శించారు. అయితే ఆ దేశ రైల్వేమంత్రి రషీద్ మాత్రం తీర్మానంలో ఆర్టికల్ 370 రద్దు ఉండాల్సిందని అన్నారు. దీంతో స్పీకర్ కలుగుజేసుకుని తీర్మానంలో ఆర్టికల్ 370 ప్రస్తావన ఉండేలా చేశారు.


First published: August 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...