అసదుద్దీన్ సభలో రభస... ‘హిందుస్తాన్ జిందాబాద్’ నినాదాలు...

అసదుద్దీన్

సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన సభలో మహిళ మైక్ తీసుకుని ‘హిందుస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసింది.

  • Share this:
    ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పాల్గొన్న ఓ సభలో యువతి ‘హిందుస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసింది. సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన ఓ సభలో మహిళ మైక్ తీసుకుని ‘హిందుస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసింది. అయితే, కొందరు వ్యక్తులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ మహిళ పేరు అమూల్య అని తెలిసింది. ‘పాకిస్తాన్ జిందాబాద్‌కి, హిందుస్తాన్ జిందాబాద్ అనడం మధ్య తేడా ఏంటంటే..’ అని ఆమె అనబోతున్న సమయంలో స్టేజీ మీద ఉన్న మరికొందరు అమూల్య మైక్‌ను లాక్కొనే ప్రయత్నం చేశారు. అయితే, ఆమె మైక్ అవసరం లేకుండా కొంచెం ముందుకు వచ్చి మైక్ లేకుండానే మాట్లాడారు. ఆ సమయంలో మరో వ్యక్తి, ఓ పోలీసు అధికారి వచ్చి ఆమెను బలవంతంగా స్టేజ్ మీద నుంచి తీసుకుని వెళ్లారు.    అమూల్య స్టేట్‌మెంట్‌‌ను అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. అమూల్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘మేం భారత్ జిందాబాద్ అనేవాళ్లం. భారత్ జిందాబాద్ అనే అంటాం.’ అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: