తగ్గేది లేదు.. ఆర్టీసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన అశ్వత్థామరెడ్డి..

TSRTC Strike : ఈ నెల 21వ తేదీన అన్ని ఆర్టీసీ డిపోల ముందు ఆర్టీసీ కుటుంబాలతో బైఠాయింపు ఉంటుందన్నారు.

news18-telugu
Updated: October 20, 2019, 1:34 PM IST
తగ్గేది లేదు.. ఆర్టీసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన అశ్వత్థామరెడ్డి..
ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి,సీఎం కేసీఆర్ (File Photos)
  • Share this:
హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన భవన్‌లో ఆర్టీసీ జేఏసీ నేతలు రాజకీయ పార్టీల మధ్య జరిగిన భేటీ కాసేపటి క్రితం ముగిసింది. భేటీ అనంతరం ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 21వ తేదీన అన్ని ఆర్టీసీ డిపోల ముందు ఆర్టీసీ కుటుంబాలతో బైఠాయింపు ఉంటుందన్నారు. 22వ తేదీన తాత్కాళిక డ్రైవర్లు,కండక్టర్లకు ఆర్టీసీ కార్మికుల పొట్టకొట్టవద్దని విజ్ఞప్తి చేస్తామన్నారు. రూ.1000,రూ.1500కి ఆశపడి తాత్కాళికంగా విధులు నిర్వహిస్తున్నవారు.. 22వ తేదీ నుంచి విధులకు
దూరంగా ఉండాలన్నారు. ప్రజా రవాణాను ప్రైవైటీకరించకుండా తాము చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలన్నారు. అలాగే 23వ తేదీన ప్రజా ప్రతినిధులతో ములాఖత్ ఉంటుందని తెలిపారు. 24వ తేదీన మహిళా కండక్టర్లంతా ఆర్టీసీ డిపోల ఎదుట దీక్షలు చేపడుతారని చెప్పారు. 25వ తేదీన హైవేలపై బైఠాయించి దిగ్భంధం చేస్తామన్నారు. 26వ తేదీన ఆర్టీసీ కుటుంబాల పిల్లలతో దీక్షలు చేపడుతామని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆర్టీసీ పోరాటాన్ని ఆపేది లేదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే,ఆర్టీసీ డిమాండ్ల కోసం ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మబలిదానం చేసుకోగా.. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఖాజామియా అనే ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. 15 రోజుల నుంచి ఆయన ఆర్టీసీ సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఓవైపు ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం దాల్చుతున్నా.. ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించడం లేదు. సీఎం కేసీఆర్ ఇకనైనా మొండివైఖరి వీడి ఆర్టీసీతో చర్చలు జరపాలని ఆర్టీసీ జేఏసీ నేతలు,ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు సూచనలను సైతం బేఖాతరు చేయడం ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సబబు కాదని గుర్తుచేస్తున్నారు.

First published: October 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading