RSS మ‌రో సంచ‌ల‌నం...రాహుల్ గాంధీకి ఆహ్వానం ?

రాజకీయాలకు అతీతంగా పలు పార్టీల నేతలను ఆర్ఎస్ఎస్ ఆహ్వానించనుండగా...ఈ జాబితాలో రాహుల్ గాంధీ, సీతారం ఏచూరీ తదితరుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: August 27, 2018, 6:22 PM IST
RSS మ‌రో సంచ‌ల‌నం...రాహుల్ గాంధీకి ఆహ్వానం ?
రాహుల్ గాంధీ(File)
  • Share this:
బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీకి అస్స‌లు ప‌డ‌దు. బీజేపీని విమ‌ర్శించే క్ర‌మంలో ఆర్ఎస్ఎస్‌ను కూడా విమ‌ర్శిస్తుంటారు కాంగ్రెస్ నేత‌లు. ఆ పార్టీ ప్ర‌స్తుత అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ సైతం అదే చేస్తున్నారు. న‌రేంద్ర‌మోదీ, బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్‌ను కూడా అంతే స్థాయిలో ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. లండన్ పర్యటనలో ఆర్ఎస్ఎస్‌ను అతివాద మతతత్వ పార్టీ(ముస్లీం బ్రదర్‌హుడ్ పార్టీ)తో పోల్చడంపై వివాదం ఇంకా సద్దుమణగలేదు.  అయితే త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న రాహుల్ గాంధీని త‌మ ఆధ్వ‌ర్యంలో జ‌ర‌గ‌బోయే స‌మావేశాల‌కు ఆహ్వానించేందుకు ఆర్ఎస్ఎస్ యోచిస్తోంద‌ని ఊహాగానాలు జోరందుకున్నాయి.

సెప్టెంబ‌ర్ 17 నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో ఆర్ఎస్ఎస్ సమావేశాల‌ను నిర్వ‌హిస్తోంది. 'ఫ్యూచ‌ర్ ఆఫ్ భార‌త్, ఎన్ ఆర్ఎస్ఎస్ ప‌ర్స్‌పెక్టివ్' అనే పేరుతో జ‌ర‌గ‌బోయే ఈ కార్య‌క్ర‌మానికి ఆర్ఎస్ఎస్  చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ అధ్య‌క్ష‌త వ‌హించ‌బోతున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి పార్టీలు, సిద్ధాంతాల‌తో సంబంధం లేకుండా ప‌లువురు ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించేందుకు ఆర్ఎస్ఎస్ సిద్ధ‌మ‌వుతోంది.

అయితే వీరి అతిధుల జాబితాలో రాహుల్ గాంధీ పేరు కూడా ఉంద‌నే ప్ర‌చారం సంచ‌ల‌నం సంచ‌లనం సృష్టిస్తోంది. రాహుల్ గాంధీతో పాటు సీపీఎం జాతీయ నేత సీతారం ఏచూరి, మ‌రికొంద‌రు ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను కూడా ఈ కార్యక్ర‌మానికి ఆహ్వానిస్తార‌ని వార్త‌లు మొద‌ల‌య్యాయి.


కాంగ్రెస్ పార్టీలో ద‌శాబ్దాల పాటు కొన‌సాగిన మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీను కొద్ది నెల‌ల క్రితం జ‌రిగిన త‌మ స‌మావేశాల‌కు ఆర్ఎస్ఎస్ ఆహ్వానించింది. ఇది అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నానికి దారి తీసింది. అయితే ప్ర‌ణ‌బ్ ఈ ఆహ్వానాన్ని మ‌న్నించి ఆ స‌మావేశంలో పాల్గొని త‌న అభిప్రాయాన్నిపంచుకున్నారు. దీంతో మ‌రోసారి ఆర్ఎస్ఎస్ అదే త‌ర‌హాలో ఇత‌ర పార్టీ నాయ‌కుల‌ను మ‌రీ ముఖ్యంగా రాహుల్ గాంధీని ఆహ్వానిస్తుందా అనే అంశం ఆస‌క్తిని రేపుతోంది. ఇటీవ‌ల ఆర్ఎస్ఎస్‌ను ముస్లిం బ్ర‌ద‌ర్ హుడ్‌తో పోల్చుతూ రాహుల్ విమ‌ర్శ‌లు చేశారు. ఇందుకు ఆర్ఎస్ఎస్ కూడా గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో ఆర్ఎస్ఎస్ నిజంగానే రాహుల్‌ను ఆహ్వానిస్తుందా అనేది ఉత్కంఠ‌గా మారింది.

మ‌రోవైపు త‌మ స‌మావేశాల‌కు ఎవ‌రిని ఆహ్వానించాల‌నే దానిపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఆర్ఎస్ఎస్ ప్ర‌చార్ ప్ర‌ముఖ్ అరుణ్ కుమార్ తెలిపారు.
Published by: Janardhan V
First published: August 27, 2018, 6:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading