• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • RS 1500 UNEMPLOYMENT ALLOWANCE 10 LAKH JOBS FARM LOAN WAIVER IN RJDS MANIFESTO FOR BIHAR POLLS BA

Bihar Elections: ఆర్జేడీ మేనిఫెస్టోలో భారీ వరాలు, 10 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఇంకా

Bihar Elections: ఆర్జేడీ మేనిఫెస్టోలో భారీ వరాలు, 10 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఇంకా

Bihar Elections 2020: అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్న తేజస్వి యాదవ్

నిరుద్యోగులకు నెలకు రూ.1500 భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లాలూ కుమారుడు, ఆర్జేడీకి నాయకత్వం వహిస్తున్న తేజస్వి యాదవ్ ప్రకటించారు.

  • Share this:
    RJD Manifesto: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిదశ పోలింగ్ దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి. మొన్న బీజేపీ తమ మేనిఫెస్టోను ప్రకటించింది. ఇప్పుడు ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అందులో భారీ హామీలు గుప్పించింది. నిరుద్యోగులకు నెలకు రూ.1500 భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లాలూ కుమారుడు, ఆర్జేడీకి నాయకత్వం వహిస్తున్న తేజస్వి యాదవ్ ప్రకటించారు. అలాగే రైతులకు రుణమాఫీ కూడా హామీ ఇచ్చింది ఆర్జేడీ. బీహార్‌లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 28న మొదటి దశ, నవంబర్ 3న రెండో దశ, నవంబర్ 7న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఆర్జేడీ మేనిఫెస్టో ప్రకటన సందర్భంగా తేజస్వి యాదవ్ మాట్లాడుతూ ‘ఇది కేవలం మేనిఫెస్టో కాదు. నిజంగా మార్పు తీసుకురావడానికి మేం చేసే ప్రమాణం. మేనిఫెస్టో సిద్ధం చేసే సమయంలో ప్రతి సెక్టార్‌ను పరిగణనలోకి తీసుకున్నాం. అప్పుడే బీహార్‌ను హ్యాపీ, మరింత ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చు.’ అని అన్నారు.

    బీహార్‌లో అధికార బీజేపీ - జేడీయూ కూటమి మీద తేజస్వి యాదవ్ విరుచుకుపడ్డారు. ఒకవేళ తాము కూడా బీజేపీ, డబుల్ ఇంజిన్ గవర్న‌మెంట్ (బీహార్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నడుస్తోందని ప్రధాని మోదీ బీహార్ ఎన్నికల ర్యాలీలో అన్న మాట) తరహాలో తప్పుడు హామీలు ఇవ్వాలనుకుంటే 50 లక్షలు లేకపోతే కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించేవారిమని తేజస్వి యాదవ్ అన్నారు. ‘ఉపాధి చూపించడానికి, ఉద్యోగం చూపించడానికి మధ్య చాలా తేడా ఉంది. చెత్త కాగితాలు ఏరుకునే వాడికి కూడా ఉపాధి ఉన్నట్టే. కానీ, మేం 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నాం. మొదటి కేబినెట్ సమావేశంలోనే దీనిపై సంతకం పెడతాం. హెల్త్ కేర్ సెక్టార్‌లో, ఎడ్యుకేషన్ సెక్టార్, మొదలైన వాటిలో 4.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 7 శాతం జూనియర్ ఇంజినీర్ల పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి.’ అని తేజస్వి యాదవ్ అన్నారు.



    బీహార్‌లో బీజేపీ - జేడీయూ కలసి పోటీ చేస్తున్నాయి. ఆర్జేడీ - కాంగ్రె్స పార్టీలు కలసి మహాకూటమి పేరుతో బరిలో దిగుతున్నాయి. మహాకూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉంటారని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మీద తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. కేవలం బీహార్‌కు సంబంధించి కేవలం కొన్ని అంశాలను మాత్రమే తన ప్రసంగంలో ప్రస్తావించడాన్ని, అసలైన విషయాలు వదిలేశారని మండిపడ్డారు. శుక్రవారం రోజు బీహార్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ గతంలో ఆర్జేడీ 15 ఏళ్ల పాలన చట్టమే లేకుండా సాగిందని మండిపడ్డారు. మొత్తం లాలూ చెప్పిందే నడిచిందన్నారు. బీహార్‌లో 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ - ఆర్జేడీ కలసి పోటీ చేశాయి. మధ్యలో వారిద్దరికీ చెడింది. బీజేపీ మద్దతుతో జేడీయూ అధినేత నితీష్ కుమార్ సీఎంగా కొనసాగుతున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: