కేసీఆర్ సొంతూరుకు రూ. 10 కోట్ల నిధులు మంజూరు

Cm kcr chintamadaka tour | రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తన సొంతూరులో పర్యటించేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్... ఒక రోజంతా గ్రామంలోనే గడపాలని నిర్ణయించారు.

news18-telugu
Updated: July 10, 2019, 4:59 PM IST
కేసీఆర్ సొంతూరుకు రూ. 10 కోట్ల నిధులు మంజూరు
చింతమడక ప్రభుత్వ పాఠశాలలో వేటు వేసి బయటకు వస్తున్న కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే తన సొంత గ్రామమైన చింతమడకలో పర్యటించనున్న నేపథ్యంలో... ఆ గ్రామానికి రూ. 10 కోట్ల నిధులు మంజూరయ్యాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత తన సొంతూరులో పర్యటించేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్... ఒక రోజంతా గ్రామంలోనే గడపాలని నిర్ణయించారు. ఇప్పటికే గ్రామంలోని సమస్యలు, గ్రామస్థుల అవసరాలు ఏ విధంగా ఉన్నాయనే తెలుసుకోవాలని స్థానిక సర్పంచ్‌తో పాటు ఎమ్మెల్యే హరీశ్ రావును కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిపై హరీశ్ రావు సమీక్షలు నిర్వహిస్తున్నారు.

గ్రామస్థులతో ప్రత్యేకంగా చర్చించి వారి అవసరాల గురించి తెలుసుకుంటున్నారు మాజీమంత్రి హరీశ్ రావు. త్వరలోనే చింతమడకలో పర్యటించి గ్రామస్థుల సమస్యలతో మాట్లాడి వారి సమస్యలు తీరుస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో గ్రామానికి ప్రత్యేక నిధులను విడుదల చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి పది కోట్లు మంజూరు చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే కేసీఆర్ చింతమడక పర్యటన తేదీ ఖరారు కావాల్సి ఉంది.


First published: July 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...