Home /News /politics /

RRR AND INDIAS ECONOMY HAVE SOMETHING IN COMMON PIYUSH GOYAL FINDS A CONNECTION SB

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ (Twitter/Photo)

ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్ (Twitter/Photo)

ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు అన్ని వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సినీ సెలబ్రిటీలే కాదు.. ఇప్పుడు రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. తాజాగా మోడీ కేబినెట్‌లో ఓ మంత్రి ఆర్ఆర్ఆర్ సినిమాపై ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్‌. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఆర్ఆర్ఆర్ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమాపై రాజకీయ నేతలు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన నాటి నుంచి వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. దీంతో ఇప్పుడు RRR సినిమా కలెక్షన్స్ పై ఏకంగా ప్రముఖ కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    తాజాగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కూడా `ఆర్ ఆర్ ఆర్` సినిమా వసూళ్ల తో రికార్డులు సృష్టించినట్లే భారత ఆర్ధిక వ్యవస్థ కూడా రానున్న రోజుల్లో రికార్డు సృష్టిస్తుందని జోస్యం చెప్పారు. `ఆర్ ఆర్ ఆర్` సినిమా 750 కోట్లు వసూళ్లు సాధించిందని తాను కూడా విన్నానని.. అదే విధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా రికార్డులను బద్దలు కొడుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు పియూష్. 2021-22 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఎగుమతి సంఖ్య $418 బిలియన్లకు చేరుకోవడంపై వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ హర్షం ఆనందం చేసారు.

    ఎన్టీఆర్ (NTR) ఎన్టీఆర్,రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. ఈ సినిమా మొదటి వారం పూర్తి అయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా 710 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది.

    ఇక నిన్నటితో సినిమా విడుదలై తొమ్మిది రోజులు పూర్తవ్వడంతో పాత రికార్డులన్నింటిని క్రాస్ చేసింది. తొమ్మిది రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 19.62 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. తొమ్మిది రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. బాహుబలి 2 సినిమా 9వ రోజు 6.51 కోట్ల అందుకుంది. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు ఉంది. ఆ తర్వాత అల వైకుంఠపురములో ఉంది. దీంతో ఆర్ ఆర్ ఆర్ 9వ రోజు కలెక్షన్స్‌ రికార్డ్‌ ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Piyush Goyal, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు