ROWDYSHEETER ATTACKS ON TDP MPTC CANDIDATE IN GUNTUR DISTRICT BA
గుంటూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థి ఇంటిపై రౌడీషీటర్ దాడి...
అప్పట్లో ఎంపీలు పార్లమెంట్లో చేసిన పోరాటాన్ని స్పూర్తిగా తీసుకోవాలని ఆయన పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం. అయితే అమరావతి విషయంలో చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేసేందుకు టీడీపీ నేతలు అంత సుముఖంగా లేరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కట్టా దివ్య ఇంటిపై దాడి జరిగింది.
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కట్టా దివ్య ఇంటిపై దాడి జరిగింది. విచక్షణ రహితంగా కర్రలతో, రాళ్లతో, కత్తులతో మూకుమ్మడిగా దాడి చేశారు. రౌడీషీటర్ యామర్తి పాపులు ఈ దాడికి తెగబడినట్టు చెబుతున్నారు. ఆ రౌడీషీటర్ పాపులు వైసీపీ నాయకుడు సింగారెడ్డి కోటిరెడ్డి ప్రధాన అనుచరుడు. పాపులు మరదలు గ్రామ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో అభ్యర్థి కట్టా దివ్యను నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేశారు. ఆమె నిరాకరించడంతో ఈరోజు కట్టా దివ్య ఇంటి పై వైసీపీ శ్రేణులు, రౌడీలు పెద్ద ఎత్తున దాడికి తెగబడ్డారు. గ్రామ ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ గ్రామంలో ఇలా తగాదాలు చోటుచేసుకుందని కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుందని చెప్పారు. కట్టా దివ్య బాబాయిలు నాగేశ్వరరావు, నాగయ్యతో పాటు వైసీపీ లోని ఇద్దరికి తీవ్రమైన గాయాలు అయ్యాయి.
కొందరు వైసీపీ నాయకుల అండదండలతో ఇంటి మీద ఇలా దాడి చేస్తూ రెచ్చిపోవడం ఎంతవరకు న్యాయం అని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థి కుటుంబ సభ్యులపై దాడి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. తక్షణమే అధికారులు నిందితులను అరెస్టు చేసి కట్టా దివ్య కుటుంబానికి న్యాయం చెయ్యాలని కోరుతున్నారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.