• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • ROW OVER BHARAT RATNA CONTINUES NOW ASADUDDIN OWAISI QUESTIONS CENTRES CHOICE FOR AWARD

‘భారతరత్న’ ఎంపికపై అసదుద్దీన్ వివాదాస్పద కామెంట్స్

‘భారతరత్న’ ఎంపికపై అసదుద్దీన్ వివాదాస్పద కామెంట్స్

అసదుద్దీన్ ఓవైసీ (ఫైల్ ఫొటో)

Bharat Ratna Row | ఇప్పటికే లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, యోగా గురువు బాబా రాందేవ్ ‘భారత రత్న’ ఎంపికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా వివాదాస్పద కామెంట్స్ చేశారు.

 • Share this:
  దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’పై వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, యోగా గురువు బాబా రాందేవ్ ‘భారత రత్న’ ఎంపికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా వారి బాటలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో భారతరత్న అవార్డును బీఆర్ అంబేద్కర్‌కు ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇచ్చారే తప్ప..హృదయపూర్వకంగా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజికవేత్త నానాజీ దేశ్ ముఖ్‌కు ఇచ్చిన నేపథ్యంలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

  మహారాష్ట్రలోని కల్యాణ్ నగరంలో వంచిత్ బహుజన్ సభలో ఒవైసీ మాట్లాడారు. ఇప్పటి వరకు ఎంతమంది దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, పేదలు, అగ్రవర్ణాలైన బ్రాహ్మణులకు ‘భారతరత్న’ అవార్డులు ఇచ్చారని ఒవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు.
  First published: