వైసీపీలో అప్పుడే పదవుల సందడి... కీలక మంత్రి శాఖ కోసం రోజా ప్రయత్నాలు

వైసీపీలో అప్పుడే పదవుల సందడి... కీలక మంత్రి శాఖ కోసం రోజా ప్రయత్నాలు

వైసీపీ ఎమ్మెల్యే రోజా (ఫైల్ ఫోటో)

వైసీపీ ప్ర‌భుత్వం ఏర్పాడితే కీల‌క మంత్రి ప‌ద‌విపై రోజా క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రికొంత మంది నేత‌లు కూడా త‌మ‌కు ఏ మంత్రి ప‌ద‌వి కావాలో వాటి కోసం ఇప్ప‌టి నుంచి జ‌గ‌న్ వ‌ద్ద‌కు విజ్ఞ‌ప్తులు తీసుకెళ్లుతున్న‌ట్లు వైసీపీ వ‌ర్గాల స‌మాచారం.

  • Share this:
    ఏపీలో పొలింగ్ ముగిసింది. ఇప్పుడు పార్టీలన్నీ గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారు వేసుకుంటూ బిజీ,బిజీగా గ‌డుపుతున్నాయి. ఒక వైపు టీడీపీ 130 స్థానాల‌తో తామే ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేస్తోంటే.. మ‌రో వైపు వైసీపీ కూడా అదే ధీమాను చూపిస్తోంది. అయితే గెలుపు ధీమా వైసీపీ నేత‌ల్లో కాస్త ఎక్కువగా క‌నిపిస్తోన్న‌ట్లు ఉంది. మ‌రికొద్ది రోజుల్లో త‌మ పార్టీ అధికారంలోకి రాబోతుంద‌ని ప‌క్కాగా డిసైడ్ అయిపోయారు. దీంతో అప్పుడే తమ రాజకీయ భవిషత్తు బాగుండాలని పైరవీలు ప్రారంభించేశారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఏ ప‌ద‌వి అయితే త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ బాగుంటుంద‌నే దానికి సంబంధించి ఇప్ప‌టి నుంచే లెక్క‌లేసుకొని వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. జ‌గ‌న్ పార్టీలో కీల‌క నేత‌లు పార్టీ అధికారంలోకి వ‌చ్చేసింద‌ని ఫీల్ అవుతున్నారు. దీంతో త‌మ‌కు ఏ మంత్రి ప‌ద‌వి కావాలో కూడా నిర్ణ‌యించుకొని జ‌గ‌న్ వ‌ద్ద ప్ర‌తిపాద‌న‌లు చేస్తోన్న‌ట్లు స‌మాచారం.
    ఇందులో భాగంగా పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే పార్టీలో కీల‌క గొంతుగా మారిన రోజా ఈ అంశంలో కాస్త ముందున్నారు. ఫ‌లితాలు వెల్లువ‌డిత‌న త‌రువాత త‌మ పార్టీకి భారీ మెజార్టీ రావ‌డంతోపాటు తాను పోటీ చేస్తోన్న న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం లోకూడా భారీ మెజార్టీతో గెలుస్తాన‌న్న ధీమాను ఆమె వ్య‌క్తం చేస్తోన్నారు.

    దీంతో పాటు వైసీపీ ప్ర‌భుత్వం ఏర్పాడితే కీల‌క మంత్రి ప‌ద‌వి పై ఆమె క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో రాజ‌శేఖ‌ర‌రెడ్డి హాయంలో స‌బితా ఇంద్రారెడ్డికి రాష్ట్ర హోంమంత్రి ప‌దవి ఇచ్చి పార్టీలో మ‌హిళ‌ల‌ను వైఎస్ ఎలా గౌర‌వించారో ఆయ‌న కుమారుడైన జ‌గ‌న్ కూడా త‌న‌కు హోంమంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెడతారాని గంపెడు ఆశ‌లు రోజా పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. దీంతో పాటు నాలుగెళ్లు ప్ర‌తిప‌క్షంలో తాను పార్టీ కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డ‌ానో జ‌గ‌న్ గుర్తిస్తార‌ని రోజా ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన స‌న్నిహితుల‌తో కూడా రోజా ఇవే వ్యాఖ్య‌లు చేస్తోన్న‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ త‌నకు హోం శాఖ కాక‌పోతే ఏం ఇస్తారు అని రోజా ధీమా వ్య‌క్తం చేస్తోన్న‌ట్లు తెలుస్తోంది.

    ఇదిలా ఉంటే వైసీపీలో ఉన్న మ‌రికొంత మంది నేత‌లు కూడా త‌మ‌కు ఏ మంత్రి ప‌ద‌వి కావాలో వాటి కోసం ఇప్ప‌టి నుంచి జ‌గ‌న్ వ‌ద్ద‌కు విజ్ఞ‌ప్తులు  తీసుకెళ్లుతున్న‌ట్లు వైసీపీ వ‌ర్గాల స‌మాచారం. మ‌రో వైపు టీడీపీ నేత‌లు వైసీపీ అతి వ్య‌వ‌హారం చూసి న‌వ్వుకుంటున్నారు. పార్టీ గెలుపు మాట ప‌క్క‌న పెట్టి జ‌గన్ పార్టీ త‌రుపున పోటీ చేసిన వాళ్లు గెలుస్తారో లేదో ముందు చూసుకోవాల‌ని టీడీపీ నేత‌లు ఎద్దెవా చేస్తోన్నారు. పోలింగ్ తురువాత ఇంకా ఫ‌లితాలు రాక‌ముందే వైసీపీ అధినేత‌తో స‌హా అంద‌రు అధికారం కోసం ఎంత‌లా త‌హాత‌హాలాడుతున్నారో అర్దం చేసుకోవ‌చ్చ‌ని అంటున్నారు టీడీపీ నేత‌లు. జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డం క‌ల‌గానే మిగిలిపోతుంద‌ని టీడీపీ130 స్థానాల‌తో మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తోంద‌ని ధీమా వ్య‌క్తం చేస్తోన్నారు. మొత్తానికి ఏ పార్టీ ఏ లెక్క‌లేసుకున్నా వారి లెక్క‌లు మాత్రం ఇంకా ఈవీఎంల్లోనే ఉన్నాయి. ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు వేచిచూడాల్సిందే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

    (బాలకృష్ణ, న్యూస్ 18 తెలుగు, సీనియర్ కరస్పాండెంట్)
    First published: