కుప్పంలో కేజీ పప్పు కూడా ఇవ్వని చంద్రబాబు: రోజా ఫైర్

ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలను విమర్శించే హక్కు హైదరాబాద్‌లో కూర్చున్న చంద్రబాబుకి, లోకేష్‌కు లేదని అన్నారు.

news18-telugu
Updated: April 18, 2020, 9:50 PM IST
కుప్పంలో కేజీ పప్పు కూడా ఇవ్వని చంద్రబాబు: రోజా ఫైర్
రోజా (Roja)
  • Share this:
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తాను ఎన్నికైన కుప్పం నియోజకవర్గంలో కేజీ కందిపప్పు కూడా పంచలేదని ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి విమర్శించారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలను విమర్శించే హక్కు హైదరాబాద్‌లో కూర్చున్న చంద్రబాబుకి, లోకేష్‌కు లేదని అన్నారు. కరోనా పరీక్షల విషయంలో దేశంలోనే ఏపీ నాలుగో స్థానంలో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులను తగ్గించి చెబుతున్నారనే చంద్రబాబు అనుమానాల మీద కూడా రోజా ఫైర్ అయ్యారు. వైద్య పరీక్షల మీద అనుమానం ఉంటే వచ్చి ఏపీలో చెక్ చేసుకోవాలని సూచించారు. టీడీపీకి చెందిన నేతలు, మాజీ మంత్రుల మీద కూడా రోజా ఫైర్ అయ్యారు. వారు కరోనా పరీక్షలు చేయించుకుంటే ప్రభుత్వం కేసులు దాచిపెట్టిందో లేదో క్లారిటీ వస్తుందన్నారు. కుప్పం, మంగళగిరి ప్రజలు కష్టాల్లో ఉంటే.. వారిని గాలికొదిలేసి చంద్రబాబు హైదరాబాద్‌లో వ్యాపారం చేసు​కుంటున్నారని, లోకేష్‌ సైక్లింగ్‌ చేసుకుంటున్నారని విమర్శించారు. లాక్‌డౌన్‌ వేళ అనేక మంది పేద ప్రజలకు మద్దతుగా ఉంటే.. చంద్రబాబు కుప్పంలో కేజీ పప్పు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. మూడుసార్లు సీఎంగా చేసి వైద్యరంగాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు.
First published: April 18, 2020, 9:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading