రోజా మంత్రి పదవికి ఆ ఎమ్మెల్యే నుంచి గట్టి పోటీ

మోపిదేవి రాజీనామాతో ఖాళీ అయ్యే మంత్రి పదవిని మళ్లీ గుంటూరు జిల్లాకే ఇస్తే... ఈ రేసులో అందరికంటే ముందుండేది ఎమ్మెల్యే ఆర్కేనే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

news18-telugu
Updated: February 5, 2020, 12:28 PM IST
రోజా మంత్రి పదవికి ఆ ఎమ్మెల్యే నుంచి గట్టి పోటీ
రోజా(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో శాసనమండలిని రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. దీంతో ఎమ్మెల్సీలుగా ఉంటూ మంత్రులుగా కొనసాగుతున్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తమ పదవులు కోల్పోయే అవకాశం ఉంది. దీనిపై వారితో జగన్ ముందుగానే చర్చించారని... వారికి మరో రకంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. వారిద్దరిని రాజ్యసభకు పంపించే యోచనలో సీఎం జగన్ ఉన్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. వీరి సంగతి ఇలా ఉంటే... మంత్రులుగా వీరి రాజీనామాతో ఖాళీ అయ్యే స్థానాలు ఎవరికి దక్కుతాయనే దానిపై ఏపీ రాజకీయవర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది.

ఇద్దరు మంత్రులు రాజీనామా చేస్తే... ఎప్పటి నుంచో మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న రోజాకు ఛాన్స్ ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇద్దరు మంత్రుల రాజీనామా రోజుకు బాగా కలిసొస్తుందనే చర్చ వైసీపీలోనూ సాగుతోంది. అయితే గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి మోపిదేవి రాజీనామా... మరో వైసీపీ ఎమ్మెల్యేకు వరంగా మారొచ్చనే ఊహాగానాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. మోపిదేవి రాజీనామాతో ఖాళీ అయ్యే మంత్రి పదవిపై మంగళగిరికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారని తెలుస్తోంది.

మోపిదేవి రాజీనామాతో ఖాళీ అయ్యే మంత్రి పదవిని మళ్లీ గుంటూరు జిల్లాకే ఇస్తే... ఈ రేసులో అందరికంటే ముందుండేది ఎమ్మెల్యే ఆర్కేనే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆర్కేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయనను మంత్రిని చేస్తానని సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజలకు హామీ కూడా ఇచ్చారు. దీంతో అన్నీ కలిసొస్తే తనకు మంత్రి పదవి ఖాయమనే యోచనలో ఎమ్మెల్యే ఆర్కే ఉన్నట్టు తెలుస్తోంది. బీసీ వర్గానికి చెందిన మోపిదేవి రాజీనామాతో ఖాళీ అయ్యే మంత్రి పదవి మళ్లీ బీసీలకే ఇవ్వాలని జగన్ నిర్ణయిస్తే తప్ప... ఆ పదవి ఎమ్మెల్యే ఆళ్లకు ఖాయమనే చర్చ జరుగుతోంది.First published: February 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు