రోజా రెండున్నరేళ్లు వెయిట్ చేయాల్సిందేనా ?

శుక్రవారం వైసీపీఎల్పీ సమావేశానికి హాజరైనప్పుడు కూడా తనకు మంత్రి పదవి వస్తుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. అయితే మంత్రుల జాబితాలో మాత్రం ఆమె పేరు కనిపించలేదు.

news18-telugu
Updated: June 8, 2019, 2:04 PM IST
రోజా రెండున్నరేళ్లు వెయిట్ చేయాల్సిందేనా ?
రోజా (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ మంత్రివర్గ విస్తరణలో వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు కచ్చితంగా ఛాన్స్ ఉంటుందని అంతా అనుకున్నారు. శుక్రవారం వైసీపీఎల్పీ సమావేశానికి హాజరైనప్పుడు కూడా తనకు మంత్రి పదవి వస్తుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. అయితే మంత్రుల జాబితాలో మాత్రం ఆమె పేరు కనిపించలేదు. రోజాను విజయవాడలో అందుబాటులో ఉండాలని సీఎం జగన్ ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. ఆమెకు జగన్ స్పీకర్ పదవి ఆఫర్ చేశారని... కానీ ఆ పదవి చేపట్టేందుకు ఆమె అంగీకరించలేదనే ప్రచారం కూడా జరిగింది. ఏదేమైనా... ఈ సారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు కచ్చితంగా చోటు దక్కుతుందని భావించిన రోజా ఆశలు ఆవిరయ్యాయి. ఇక ఆమెకు జగన్ ఏ రకమైన పదవి ఇస్తారనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మరోవైపు ప్రస్తుతం మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న వారిలో చాలామంది రెండున్నరేళ్లలో రిటైర్ అవుతారని ముందుగానే సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. దీంతో రెండున్నరేళ్ల తరువాత రోజాకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం లేకపోలేదని పలువురు వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. రోజాతో పాటు మంగళగిరిలో గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి వారికి కూడా మంత్రివర్గంలో చోటు ఖాయమని చాలామంది ఫిక్స్ అయ్యారు. ఆళ్లకు మంత్రి పదవి విషయంలో జగన్ బహిరంగంగానే హామీ కూడా ఇచ్చారు. కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో అది సాధ్యపడలేదు. దీంతో రోజా తరహాలోనే ఆయన కూడా రెండున్నరేళ్లు వెయిట్ చేయాల్సిందే అనే టాక్ వినిపిస్తోంది.

First published: June 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading