డ్వాక్రా లోన్ డబ్బులు అప్పుడొస్తాయ్... మహిళలకు రోజా తీపి కబురు..

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళా సంఘాలకు తీపికబురు అందించారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా సెల్వమణి.


Updated: April 24, 2020, 7:40 PM IST
డ్వాక్రా లోన్ డబ్బులు అప్పుడొస్తాయ్... మహిళలకు రోజా తీపి కబురు..
జబర్దస్త్‌లో నటించడం తమ నాయకుడికి తెలుసని.. తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకురాలిగా మారితే అవన్నీ వదిలేస్తానని చెప్పింది. జబర్దస్త్ వల్ల తనకు ఉండే క్రేజ్ అలా కంటిన్యూ అవుతుందనే బాధతో మాట్లాడుతున్నారని.. అది మంచి కామెడీ షో మాత్రమే అని దాని వల్ల చాలా మంది ఆరోగ్యం కూడా బాగు పడుతుందని చెప్పుకొచ్చింది రోజా.
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళా సంఘాలకు తీపికబురు అందించారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా సెల్వమణి. ఏపీలో 90 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి రూ.1400 కోట్లను రిలీజ్ చేశారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఈ నిధులు రిలీజ్ చేశారు.2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు మహిళా సంఘాల రుణాలపై వడ్డీ కింద ఈ మొత్తాన్ని చెల్లించారు. ఈ నిర్ణయాన్ని రోజా అభినందించారు. ‘90 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రాష్ర్టవ్యాప్తంగా వారి అకౌంట్లలోకి రూ.1400 కోట్లు రావడమనేది చాలా సంతోషించాల్సిన విషయం. ఒక మహిళగా మహిళలందరి తరపున నేను జగన్ కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. కరోనా సమయంలో, ఆదాయం లేని సమయంలో ఏదైనా సాకులు చెప్పి తప్పించుకోవచ్చు. అలా తప్పించుకునే మనస్తత్వం కాకుండా ఎప్పుడూ కూడా ఆడపడుచులకు అన్నా, తమ్ముడిగా ఉండాలన్న జగన్ ఆలోచనను నేను అభినందిస్తున్నా.’ అని రోజా అన్నారు.

డ్వాక్రామహిళల గురించి మాట్లాడే అర్హత టీడీపీ వారికి ఉందా అని రోజా ప్రశ్నించారు. గతంలో 2016-2019 వరకు సున్నావడ్డీ ఇవ్వకుండా దాదాపు రూ.3000 కోట్లు చంద్రబాబు ఎగ్గొట్టి మోసం చేసిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. చంద్రబాబు అసలు, వడ్డీతో సహా మాఫి చేస్తామని ఎన్నికలలో హామి ఇచ్చి వారిని అప్పుల్లో ముంచేసి వెళ్లారని ఆరోపించారు. ‘మా మేనిఫెస్టో వారు చదివారో లేదో తెలియదు గానీ, ఒకసారి కళ్లు తెరిచి చూడండి. రెండో సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాలు నాలుగు విడతలుగా డ్వాక్రా లోన్ అక్కా చెల్లెమ్మల అకౌంట్లలోకి వేస్తామని జగన్ చెప్పారు. దాని ప్రకారంగా చేస్తారు’ అని రోజా అన్నారు.

మహిళల కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని చెప్పారు. అమ్మ ఒడి, వసతి దీవెన, దిశ చట్టం, దిశ యాప్ వంటివి ఎన్నో తెచ్చారన్నారు. జగన్ వచ్చాక నామినేటెడ్ పోస్టులలో గాని, నామినేటెడ్ వర్క్స్ లో గాని , వాలంటీర్ వ్యవస్దలోగాని 50 శాతం మహిళలకు ఇచ్చి గౌరవిస్తున్నారన్నారు. ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతుందని ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్పారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: April 24, 2020, 5:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading