బాలకృష్ణతో సెల్ఫీ కోసం ఎగబడ్డ వైసీపీ ఎమ్మెల్యేలు.. సోషల్ మీడియాలో వైరల్..

ఓ వైపు టీడీపీ ఎమ్మెల్సీలు, వైసీపీ మంత్రుల మధ్య హాట్ హాట్ ఫైట్ జరుగుతుంటే మరోవైపు, నటసింహం బాలకృష్ణతో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు.

news18-telugu
Updated: January 23, 2020, 12:07 PM IST
బాలకృష్ణతో సెల్ఫీ కోసం ఎగబడ్డ వైసీపీ ఎమ్మెల్యేలు.. సోషల్ మీడియాలో వైరల్..
ఓ వైపు టీడీపీ ఎమ్మెల్సీలు, వైసీపీ మంత్రుల మధ్య హాట్ హాట్ ఫైట్ జరుగుతుంటే మరోవైపు, నటసింహం బాలకృష్ణతో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు.
  • Share this:
ఓ వైపు టీడీపీ ఎమ్మెల్సీలు, వైసీపీ మంత్రుల మధ్య హాట్ హాట్ ఫైట్ జరుగుతుంటే మరోవైపు, నటసింహం బాలకృష్ణతో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు సందర్భంగా మండలి సమావేశాలను వీక్షించేందుకు చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ మండలి విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్నారు. కాసేటికి ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అక్కడికి వచ్చారు. గ్యాలరీలో బాలకృష్ణను చూసిన రోజా ఆయన్ను పలకరించి కాసేపు ముచ్చటించారు. సెల్ఫీలు కూడా తీసుకున్నారు. మండలి సమావేశాలను వీక్షించడానికి వచ్చిన మిగత వైసీపీ ఎమ్మెల్యేలు కూడా బాలకృష్ణను చూశారు.

ఇంకేముంది.. ఆయన వద్దకు వచ్చి పలకరిస్తూనే సెల్ఫీలు దిగారు. దాదాపు పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆయన చుట్టూ చేరి సెల్ఫీల్లో మునిగిపోయారు. తాజాగా.. ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి తీసిన సెల్ఫీలో బాలకృష్ణ, రోజాతో పాటు వసంత కృష్ణ కుమార్ తదితరులు ఫోజిచ్చారు. ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: January 23, 2020, 12:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading