వైసీపీలో ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల మధ్య విభేదాలు

ఫ్లెక్సీలలో ఎంపీ నందిగం సురేష్ ఫోటో చిన్నదిగా వేసి ఎమ్మెల్యే ఫోటో పెద్దదిగా వేశారని ఎంపీ వర్గీయులు మండిపడ్డారు.

news18-telugu
Updated: July 9, 2019, 3:09 PM IST
వైసీపీలో ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల మధ్య విభేదాలు
ఎంపీ సురేశ్,ఎమ్మెల్యే శ్రీదేవి
  • Share this:
గుంటూరు వైసీపీలో ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. జిల్లాలోని తాడికొండ వైసీపీలో రెండు వర్గాల మధ్య వివాదం బట్టబయలైంది. ఫ్లెక్సీలలో ఎంపీ నందిగం సురేష్ ఫోటో చిన్నదిగా వేసి ఎమ్మెల్యే ఫోటో పెద్దదిగా వేశారని ఎంపీ వర్గీయులు మండిపడ్డారు. ఎమ్మెల్యే ఫోటో వేసిన నరేంద్ర అనే వ్యక్తిని ఎంపీ అనుచరులు బెదిరించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు తమ నాయకుడిని బెదిరించిన ఎంపీ అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పలు చోట్ల వైసీపీ నేతల మధ్య విభేదాలు ఆ పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారాయి. తమ నాయకుడికి తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే కారణంగా... వారి అనుచరులు ఈ రకంగా నిరసనకు దిగుతున్నారు.


First published: July 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు